https://oktelugu.com/

Daggubati Raja: హీరోగా కలిసి రాలేదు.. కానీ వ్యాపారంలో కోట్లు సంపాదించాడు.. ఎవరో తెలుసా?

తెలుగులో వచ్చిన ‘సిరిపురం చిన్నోడు’,‘ఝాన్సీరాణి’, ‘వనిత’, ‘శ్రీకృష్ణార్జున యుద్దంలో కర్ణుడి పాత్రలో ఓ హీరోను చూసే ఉంటాం. అందమైన రూపం, చక్కని చిరునవ్వుతో ఉన్న ఈయన ఆ సమయంలో ఫేమస్ నటుడిగా కొనసాగారు. ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి తమిళ ఇండస్ట్రీకి వెళ్లారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2023 / 05:31 PM IST
    Follow us on

    Daggubati Raja: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలు, నటుల్లో చాలా మంది వారసత్వంగా వచ్చిన వారే. తెలుగుసినిమా అనగానే ముందుగా నందమూరి, అక్కినేని కుటుంబాలు గుర్తుకు వస్తాయి. ఆ తరువాత సూపర్ స్టార్ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటారు. వీరితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా సినిమాల్లో ప్రముఖంగా కొనసాగుతున్నారు. దివంగత నిర్మాత రామానాయుడు తరువాత అతని కుమారులు సినిమాల్లోకి వచ్చి సెటిలయ్యారు. వీరిలో ఒకరు సురేష్ నిర్మాతగా.. మరొకరు వెంకటేష్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాణా, అతని సోదరుడు స్టార్ డం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆకాలంలోనే దగ్గుబాటి నుంచి వచ్చిన మరో హీరో ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు.అంతేకాకుండా ఆయనను చూస్తే గుర్తుపడుతారు. కానీ ఆయన దగ్గుబాటి ఫ్యామిలికి చెందిన వారని తెలియదు. ఇంతకీ ఆయన దగ్గుబాటి ఫ్యామిలీలో ఎవరు?

    తెలుగులో వచ్చిన ‘సిరిపురం చిన్నోడు’,‘ఝాన్సీరాణి’, ‘వనిత’, ‘శ్రీకృష్ణార్జున యుద్దంలో కర్ణుడి పాత్రలో ఓ హీరోను చూసే ఉంటాం. అందమైన రూపం, చక్కని చిరునవ్వుతో ఉన్న ఈయన ఆ సమయంలో ఫేమస్ నటుడిగా కొనసాగారు. ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి తమిళ ఇండస్ట్రీకి వెళ్లారు. అయితే అక్కడా కొన్నిరోజుల పాటు పలు సినిమాల్లో నటించిన ఆయన చివరికి సినిమాలు మానేసి గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతిగా మారి హ్యపీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఆంతకీ ఆయనెవరో కాదు దగ్గుబాటి రాజా.

    డాక్టర్ డి రామానాయుడు సోదరుడి కుమారుడే దగ్గుబాటి రాజా. 1981లో తమిళ చిత్రం ‘పాక్కు వెతలై’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత తమిళంలో వరుస సినిమాలు చేశారు. తెలుగులో కూడా అవకాశాలు రావడంతో కొన్ని సినిమాల్లో నటించారు. చివరగా బాలకృష్ణ లేటేస్టుగా నటించిన ‘మహానాయకుడు’ చిత్రంలో కనిపించారు. దగ్గుబాటి రాజాకు అదృష్టం వరించకపోవడంతో స్టార్ డం దక్కలేదు. దీంతో తిరిగి చెన్నై పరిశ్రమకు వెళ్లారు. అక్కడా అనుకున్న అవకాశాలు రాకపోవడంతో గ్రానైట్ పరిశ్రమలో స్థిరపడ్డారు.

    అయితే రాజాకు మోహమాటం ఎక్కువ. అందువల్ల ఆయన సినిమాల్లో నటించడానికి పెద్దగా చొరవచూపేవారు కాదు. అందువల్లే ఆయనకు అవకాశాలు రాలేదని అంటూంటారు. కానీ ఆయన ప్రస్తుతం వ్యాపారంలో మంచి పొజిషన్లో ఉన్నారు. చెన్నైలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న ఆయన రామానాయుడి ఇంట్లో కార్యక్రమాలు జరిగితే హాజరవుతూ ఉంటారు. ప్రస్తుతం ఆయన లేటేస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.