YSR Statue Removed In Ippatamm: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం సభ ని నిర్వహించుకోవడానికి మంగళగిరి లోని ఇప్పటం గ్రామ ప్రజలు స్వచ్చందం గా తమ భూములను ఇచ్చిన విషయం మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ గ్రామ ప్రజలు చూపించిన ప్రేమకి ఋణం తీర్చుకుంటూ ఇప్పటం గ్రామ పంచాయితీకి 50 లక్షల రూపాయిలు డొనేషన్ కూడా ఇచ్చాడు..అయితే పవన్ కళ్యాణ్ సభ కి భూములు ఇచ్చినందుకు కక్ష గట్టి ఏప్రిల్ నెలలో రోడ్ విస్తరణ పేరుతో గ్రామం లో ఉన్న ఇళ్లను తొలగిస్తామని అప్పట్లో నోటీసులు ఇచ్చారు.

నోటీసుల గడువు తీరడం తో అధికారులు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న ఇళ్లను కూల్చివేసిన ఘటన కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం ఇప్పటికి గమనిస్తూనే ఉన్నాము..తన మీద అంత ప్రేమ చూపించిన ఇప్పటం గ్రామ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ నేరుగా రంగం లోకి దిగి ఆ గ్రామం లో పర్యటన చేసాడు.
ఈ పర్యటన లో కూల్చివేయబడ్డ ఇళ్లను మరియు బాధితులను పరామర్శించి వారిలో ధైర్యం నింపాడు పవన్ కళ్యాణ్..ఇప్పుడు ఈ వార్త జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా నిలిచింది..ఇప్పటం లో ఒక్క ఇల్లుని కూడా కూల్చలేదని..రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నా ప్రహరీగోడలను మాత్రమే కూల్చామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభుత్వం కూల్చిన ఇళ్ళని వీడియోలతో సహా సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యడం తో అధికారులకు నోటి నుండి మాట రాలేదు..అంతే కాకుండా మనం జాతిపితలుగా కొలువబడే గాంధీజీ, నెహ్రు వంటి విగ్రహాలను కూడా ఈ గ్రామం లో కూల్చేశారని..కానీ YSR విగ్రహం కి మాత్రం చుట్టూ కంచెలు వేసి కాపాడుకున్నారని పవన్ కళ్యాణ్ హైలైట్ చెయ్యడం తో ప్రభుత్వం పై జనాల్లో తీవ్రంగా వ్యతిరేకత పెరిగింది.
ఈ సమస్య జాతీయ స్థాయిలో వైరల్ అవ్వడం తో అందరిని నమ్మించడం లో భాగంగా YSR విగ్రహం ని తొలగించేసింది ప్రభుత్వం..ఈ చర్య ద్వారా అభివృద్ధి కి అడ్డం వస్తే సొంత తండ్రి విగ్రహాన్ని తొలగించడానికి కూడా మా ముఖ్యమంత్రి వెనుకాడడు అని జనాలకు చెప్పే ప్రయత్నం చేసారు..కానీ దీనిని జనం ఎంత వరుకు నమ్ముతారో తెలీదు.