Pawan Kalyan- Ali: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కేంద్రం గా చేసుకొని తిరుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఉత్తరాంధ్ర లో పవన్ కళ్యాణ్ పర్యటన ని అధికారులు అడ్డుకోవడం దగ్గరనుండి ప్రారంభమైన ఈ వివాదం మొన్న ఇప్పటం గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించినంత వరుకు కొనసాగింది..ఇంకా కొనసాగుతూనే ఉంది..పవన్ కళ్యాణ్ ధాటిని తట్టుకోలేక అతనిని ఎలా అయినా అడ్డు తప్పించాలని వైసీపీ ప్రభుత్వం 250 కోట్ల రూపాయిలు ఆయనని చంపడానికి ముంబై లో ఒక అతనికి సుపారీ ఇచ్చిందని.

ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పై గత కొద్ది రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని..పవన్ కళ్యాణ్ కదిలికలు మొత్తాన్ని గమనిస్తూ ఆయన పై దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని జనసేన పార్టీ సంచలన ఆరోపణలు చెయ్యగా..దీనిపై వైసీపీ నాయకులూ తమదైన శైలిలో సమాధానం చెప్పారు..ఇటీవలే వైసీపీ పార్టీ తరుపున ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితమైన వైసీపీ నాయకులూ మరియు సినీ నటుడు అలీ కూడా దీనిపై స్పందించారు.
ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఎవరో కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు..జగన్ గారికి దొంగచాటున రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం లేదు..ఆయన ఏదైనా ముక్కుసూటిగా వెళ్లే మనిషి..ఏమి చెయ్యాలనుకున్న నేరుగా చేసే దమ్మున్న మనిషి..నా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాడే..చెప్పుడు మాటలు వినకుండా..నిజానిజాలు ఆయన తెలుసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్న’ అంటూ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా ఇప్పటం గ్రామం లో పవన్ కళ్యాణ్ పర్యటన గురించి కూడా అలీ మాట్లాడాడు,’అభివృద్ధి లో భాగంగా ఇళ్ళని కూల్చడం సర్వసాధారణం..అయినా ఇప్పటం లో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కూల్చలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ..పవన్ కళ్యాణ్ మరియు అలీ ప్రాణ స్నేహితులు అనే విషయం మనకి ఎప్పటి నుండో తెలుసు..కానీ రాజకీయ పరంగా అలీ 2019 లోనే వైసీపీ లో చేరాడు..అప్పటి నుండి పవన్ కళ్యాణ్ మరియు అలీ మధ్య మాటలు లేవు..రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన రెండు సినిమాలలో కూడా అలీ లేదు..భవిష్యత్తులో అయినా వీళ్ళు కాలుస్తారో లేదో చూడాలి.