Russia- Ukraine Crisis 2022: ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడంలో రష్యా చేసిన పెద్ద తప్పేంటో తెలుసా..?

Russia- Ukraine Crisis 2022: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కలిగిన రెండో దేశంగా చెప్పుకుంటున్న రష్యా.. చిన్న దేశమైన ఉక్రెయిన్ ను ఎందుకు ఆక్రమించుకోలేకపోతోంది..? కొన్ని రోజులగా దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ఎందుకు లొంగిపోవడం లేదు ఎందుకు? రష్యా చేసిన తప్పేంటి..? రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దాడుల్లో ఉక్రెయిన్ పోరాట పటిమను చూసి చాలా దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అత్యాధునిక ఆయుధాలు కలిగిని రష్యా ఇన్నిరోజులైనా ఉక్రెయిన్ ను చేజిక్కించుకోవడానికి కొన్ని తప్పులు చేస్తోందని విశ్లేషకులు […]

Written By: NARESH, Updated On : March 22, 2022 4:09 pm
Follow us on

Russia- Ukraine Crisis 2022: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కలిగిన రెండో దేశంగా చెప్పుకుంటున్న రష్యా.. చిన్న దేశమైన ఉక్రెయిన్ ను ఎందుకు ఆక్రమించుకోలేకపోతోంది..? కొన్ని రోజులగా దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ఎందుకు లొంగిపోవడం లేదు ఎందుకు? రష్యా చేసిన తప్పేంటి..? రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దాడుల్లో ఉక్రెయిన్ పోరాట పటిమను చూసి చాలా దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అత్యాధునిక ఆయుధాలు కలిగిని రష్యా ఇన్నిరోజులైనా ఉక్రెయిన్ ను చేజిక్కించుకోవడానికి కొన్ని తప్పులు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ప్రదర్శన నిరుత్సాహంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్నా లక్ష్యం నెరవేరిందా..? అంటే లేదనే వాదిస్తున్నారు. ఇంతకీ రష్యా ఎలాంటి తప్పులు చేసింది..?

Russia- Ukraine Crisis 2022

సాయుధ బలగాలపై రష్యా వార్షికానికి 60 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. ఉక్రెయిన్ వాటా కేవలం 4 బిలియన్లు మాత్రమే. ఇక రష్యా సైనిక బలగాలతో పాటు ఆధునీకరించిన ఆయుధాలను కలిగి ఉంది. రష్యా పెట్టుబడుల్లో అధిక భాగం హైపర్ సోనిక్ క్షిపణుల వంటి కొత్త ఆయుధాలను అభివృద్ధి చేస్తుంది. ప్రపంచలోనే అత్యంత అధునాతన ‘టి-14 ఆర్మటా’ యుద్ధ ట్యాంకు రష్యా వద్ద ఉంది. రెడ్ స్క్వేర్ వద్ద మాస్కో విక్టరీ డే పరేడ్ లో కనిపించిన ఈ యుద్ధ ట్యాంకు యుద్ధ క్షేత్రంలో కనిపించలేదు. వీటితో పాటు పాత టి-72 యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాల వాహనాలు, ఫిరంగులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయి.

Also Read:  ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీపై కేసీఆర్ సంచలన కామెంట్స్.. అప్పుడు అధికారంలో ఉన్నదెవరంటూ..

ఇంతటి ఆయుధాలు కలిగి ఉన్న రష్యా యుద్ధ ప్రారంభంలో ఉక్రెయిన్ పై దూసుకెళ్లింది. ఈ సమయంలో గగనతలంలో పట్టు సాధించేందుకు రష్యాకు అవకాశం వచ్చింది. అయితే రష్యా అనుకున్నట్లు సాగలేదు. ఉక్రెయిన్ వైమానిక సేనలు అప్పటికీ అప్రమత్తమయ్యారు. రష్యా ఎత్తులను త్వరగా ఎదుర్కొన్నారు. ప్రత్యర్థిని త్వరగా, నిర్ణయాత్మకంగా దెబ్బ కొట్టడంలో ఉక్రెయిన్ కీలక పాత్ర పోషించింది. కానీ ఈ విషయాన్ని రష్యా గ్రహించలేదు.

స్పెట్స్ , నాట్జ్, వీడీబీ పారాట్రూపర్ల వంటి బలగాలతో ఉక్రెయిన్ పై దాడి చేయాలని రష్యా ప్రయత్నించినా.. కీవ్ వెలుపల హోస్టోమెల్ విమానాశ్రయంపై హెలికాప్టర్ దాడుల్ని ఉక్రెయిన్ తిప్పికొట్టింది. దీంతో రష్యా తన బలగాలను గగనతలంలో పంపించడం కష్టతరమైంది. రష్యా ఎక్కువగా రోడ్డుపై వెళ్లే ఆయుధాలనే రవాణా చేసింది. దీంతో ఉక్రెయిన్ ఆకస్మిక దాడులు చేసిన రష్యా బలగాలను తిప్పికొట్టాయి. ఉత్తరం నుంచి బయలుదేరిన రష్యాకు చెందిన పొడవైన ఆయుధ వాహన శ్రేణి ఇంకా కీవ్ చుట్టుముట్టలేకపోయింది.

Russia- Ukraine Crisis 2022

ఈ యుద్ధంలో పాల్గొనేందుకు రష్యా సుమారుగా 1,90,000 బలగాలను సమకూర్చుకుంది. వీరిలో చాలా మంది యుద్దంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటి వరకు రష్యా 10 శాతం మంది సైనికులను కోల్పోయింది. అయితే ఉక్రెయిన్ మాత్రం 14 వేల రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు చెబుతోంది. రష్యా సైనికులు యుద్ధం పట్ల ఉత్సాహం, ధైర్యం కోల్పోతున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సమయంలో రష్యా సిరియా నుంచి విదేశీ బలగాలను తెప్పించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రష్యాకు యుద్ధ సామగ్రి తక్కువగా ఉండడంతో ఆయుధాల కోసం చైనాను సంప్రదిస్తుందని పాశ్చాత్య దేశాల నాయకులు అంటున్నారు.

Also Read: కాంగ్రెస్ కథ: బలోపేతం మాటున బలహీనపర్చే ప్రయత్నం..

Recommended Video:

Tags