Petrol Diesel Price Hike: పెట్రో ధరలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర భారీగా పెరగడంతో చమురు కంపెనీలు ధరలు పెంచేశాయి. దీంతో ప్రభుత్వం కూడా పెట్రో భారం ప్రజలపై వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై రూ.80 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యుడిపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పెట్రో భారంతో ప్రజలు కుదేలవుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ధరలు పెరగడం ప్రారంభం కావడంతో ఇక మీదట బాదుడే బాదుడని ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల కాలంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పెట్రో ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నవంబర్ లో పెంచిన ధరలు మళ్లీ పెరగడం ఇప్పుడే. ఈ క్రమంలో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. రోజురోజుకు ధరలు పెరిగితే మాత్రం మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల పెరుగులకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడంలో రష్యా చేసిన పెద్ద తప్పేంటో తెలుసా..?
మరోవైపు వంట గ్యాస్ ధర కూడా పెరిగింది. 14 కేజీల సిలిండర్ ధర రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగానే ధరల పెంపు అనివార్యమైందని తెలుస్తోంది. పెట్రో ధరల పెంపుదలతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగానే పెట్రో ధరలు పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.
137 రోజుల తరువాత పెట్రో ధరలు పెరుగుదల ప్రారంభమైంది. గతంలో రూ. 75 లు ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం పెరుగుతూ రూ.115 వరకు పెరిగింది. మధ్యలో కేంద్రం రూ.10 లు వ్యాట్ తగ్గించినా కొన్ని రాష్ట్రాలు మాత్రం ససేమిరా అన్నాయి. ఫలితంగా సామాన్యుడిపై భారం పడక తప్పడం లేదు. అందులో తెలంగాణ కూడా ఉండటం తెలిసిందే. ఇప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యుడిపై మరింత భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ లో ఇంకా ధరలు పెరుగుతూ పోతే వాహనాలు ఎలా నడిపేదని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు.
Also Read: పవన్ సీఎం అభ్యర్థి.. సోము వీర్రాజు బౌలింగ్ కు టీడీపీ ఔట్?
Recommended Video: