Jagan Sarkar launches new scheme .. Farmers happy?
స్కూల్లు లేవు.. కాలేజీలు లేవు. దీంతో యువత ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల మీదే పడ్డారు. ఖాళీగా బోలెడంత టైం ఉంది. అందుకే సరదాగా ఆన్ లైన్ గేమింగ్ లకు అలవాటు పడుతున్నారు. బానిసగా మారుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యువత, స్కూలు పిల్లలు ఎక్కువగా రమ్మీకి అలవాటు పడుతున్నారు. భారీగా డబ్బులు పెట్టి ఆడుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్..?
ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు మోసపోయి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్న ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రమ్మీ పేరిట జరుగున్న మోసాలు కూడా విచ్చలవిడిగా ఏపీలో నమోదవుతున్నాయి. ఎక్కువ మంది ఇందులో డబ్బులు పోగొట్టుకుంటున్నామని ఫిర్యాదు చేస్తున్నారు.
దీంతో ఏపీలో ఆన్ లైన్ రమ్మీని నిషేధించాలని ప్రభుత్వానికి డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ గేములపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి
ఏపీ సర్కార్ ఆన్ లైన్ గేమింగ్ చట్టంలో సవరణలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికే ఆన్ లైన్ రమ్మీ, జూదం, పేకాటలను నిషేధించిన సంగతి తెలిసిందే.. వాటిని ఏపీలో ఎవరు ప్రోత్సహించినా.. ఎక్కడైనా నిర్వహించినా.. ఆడినా రెండేళ్ల జైలు శిక్ష విధించేలా జగన్ సర్కార్ కఠిన నిబంధనలు పెట్టింది. భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది.