కొన్నినెలలుగా భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాల్వానాలోయలో జూన్ 15న ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భారత జవాన్లు 21మంది అమరులుకాగా చైనాకు చెందిన జవాన్లు కూడా భారీగానే మృతిచెందారు. భారత్ కంటే రెట్టింపు సైనికులను చైనా కొల్పోయినా ఆదేశం ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సంఘటన తర్వాత నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి.
Also Read: చైనా వాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు.!
చైనా ఓవైపు శాంతి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ.. మరోవైపు భారత సైనికులపై దాడికి పాల్పడాన్ని కేంద్రం కూడా సీరియస్ తీసుకుంది. దీంతో చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడుతోంది. భారత్ ఎప్పుడూ శాంతిమార్గాన్నే కోరుకుంటుందని.. అయితే తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించినా వారికి తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలోనే చైనాను రక్షణ, ఆర్థిక, రాజకీయంగా దెబ్బతీసేందుకు భారత్ యత్నిస్తోంది.
చైనాతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఐదు రఫెల్ యుద్ధవిమానాలను రప్పించింది. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. రాజకీయ వ్యూహంలో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ తదిత దేశాల మద్దతును కూడగట్టింది. భారత్ లో చైనాకు చెందిన పలు కంపెనీల కాంట్రాక్టులను, యాప్స్ ను నిషేధించింది. ఇలా బహుముఖ వ్యూహంతో భారత్ చైనాకు గట్టి గుణపాఠం చెబుతోంది. కుక్క తోక వంకర అన్నట్లు చైనా బుద్దిలో మాత్రం మార్పు రావడం లేదు. సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది.
Also Read: నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త..?
ఈక్రమంలోనే చైనాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. పీఎల్‌ఏ దళాలు తమ సమీపానికి వస్తే ఆత్మరక్షణార్థం కాల్పులు జరపక తప్పదంటూ తేల్చిచెప్పింది. ఇటీవల మాల్డోలో ఉన్నతస్థాయి కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల్లో భారత్-చైనా పోకడలను సూటిగానే ప్రశ్నించింది. ‘గతంలో జరిగిన ఒప్పందాలను చైనా పాటించట్లేదని.. ఎల్ఓసీ దాటి చొచ్చుకొస్తున్నారని.. ఇక మేమూ ఎదురుతిరగక తప్పదు.. మా బలగాలు దీటుగా బదులిస్తాయి.. మా స్థావరాల సమీపానికి వస్తే ఈసారి కాల్పులు తప్పవని’ భారత్ బృందం స్పష్టం చేసింది. త్వరగా దళాల ఉపసంహరణ చేసుకొని వెనక్కి వెళ్లాలని.. కవ్వింపులకు పాల్పడితే కాల్చివేత తప్పదని హెచ్చరినట్లు తెలుస్తోంది.