ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారం చేపట్టింది ఈ రోజే. ఆయన నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టింది నేడే. చంద్రబాబుకు ఖేదం మిగిల్చింది కూడా ఈ రోజే. వైసీపీ పతాకాన్ని రెపరెపలాడించింది. వైసీపీకి 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగు దశాబ్దాల్లో టీడీపీకి పరాభం మాయని మచ్చగా మిగిలింది. వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా జగన్ తలపెట్టిన సంకల్ప యాత్ర ప్రధాన భూమిక పోషించిందనే చెప్పాలి. దీంతో అధికారం జగన్ కు వరమైంది.
కాంగ్రెస్ పాలనపై రాష్ర్ట వ్యాప్తంగా వ్యతిరేకత మరోవైపు మోదీ ప్రభంజనం, జనసేన పవన్ కల్యాణ్ మద్దతు.. ఇలా అనేక సమీకరణలతో 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి మార్గాలు ఏర్పడ్డాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి 46 శాతం ఓట్లు సాధించగా వైసీపీ 45 శాతం ఓట్లు సాధించింది. అప్పుడు102 స్థానాల్లో విజయం సాధించి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ 67 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో, రాష్ర్టంలో టీడీపీ-బీజేపీ అధికారాన్ని పంచుకున్నాయి. నాలుగేళ్ల పాటు ప్రయాణం చేసిన టీడీపీ-బీజేపీ తరువాత విడిపోయాయి.
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చారిత్రక విజయం అందుకున్నారు జగన్. పాదయాత్రలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. దీంతో ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఫలితంగా రాష్ర్టంలో వైసీపీ పాలన ప్రారంభం అయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 11న175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్లు లెక్కించారు.
ముఖ్యమంత్రిగా జగన్2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ అధినేతగా 8 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు నిత్యం ప్రజల సమస్యలే ప్రధానంగా పోరాటం సాగించారు. ప్రజలను నమ్ముకున్న నేతగా జగన్ ను ప్రజలు ఆదరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ పాలనలో లోపాలున్నా అభివృద్ధి ఎజెండాగా ముందుకు కదులుతున్నారు.