https://oktelugu.com/

ఆ.. చీకటిరోజుకు రెండేళ్లు..

పూల్వామా ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతోంది. సరిగ్గా ఇదేరోజున పూల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్ సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో సైనికులు నేలకొరిగారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ లోని పూల్వామాలో సైనికవాహన శ్రేణిపై పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 40మంది జవాన్లు బలయ్యారు. Also Read: పశ్చిమ బెంగాల్ లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 14, 2021 / 12:50 PM IST
    Follow us on


    పూల్వామా ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతోంది. సరిగ్గా ఇదేరోజున పూల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్ సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో సైనికులు నేలకొరిగారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ లోని పూల్వామాలో సైనికవాహన శ్రేణిపై పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 40మంది జవాన్లు బలయ్యారు.

    Also Read: పశ్చిమ బెంగాల్ లో రాజకీయ అస్త్రంగా ‘జైశ్రీరాం’ ఎందుకు మారింది?

    జమ్ము శ్రీనగర్ జాతీయరహదారిపై 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జమ్ము నుంచి సైనికులు శ్రీనగర్ కు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే సీఆర్పీఎప్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది హతమయ్యాడు.

    Also Read: ఆట మొదలైంది: ఇండియా 329 ఆలౌట్.. పంత్ హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ 23/3

    సీఆర్పీఎఫ్ కాన్వయ్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది ఎడమవైపు నుంచి జవాన్ల వాహనాన్ని ఢీకొట్టాడు. పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది… సీఆర్పీఎఫ్ వాహణ శ్రేణిలోని బస్సును ఢీ కొట్టాడు. సీఆర్పీఎఫ్ కాన్వయ్ పై ఉగ్రదాడి తరువాత భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో పదిమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పూల్వామా దాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య వైరం పెరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని భారత్ మరోసారి సర్జికల్ స్ట్రయిక్ చేపట్టింది. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూ భాగంలోకి చొచ్చుకెళ్లిన భారత్ వాయుసేన విమానాలు.. బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై విరుచుకు పడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో.. దాదాపు 300మంది ఉగ్రవాదులు చనిపోయారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్ తరువాత దాయాదుల మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లో ఉన్న ఎఫ్ 16 యుద్ధవిమానాలతో పాకిస్తాన్ దాడికి యత్నించింది. కానీ భారత సైన్యం తిప్పికొట్టింది.