ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయంపై కేంద్రం పునర్ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రాజకీయ పార్టీలు.. ప్రజలు, కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకత.. భవిష్యత్ పలు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విశాఖ ఉక్కు నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నట్లు అనిపిస్తోంది.
అయితే క్షేత్రస్థాయిలో జరుగుతుంది చూస్తుంటే.. అందుకు చాన్స్ లేదనే అనుకోవాలి. ఎందుకంటే.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం లేదా.. తీసేసుకుని ప్రయివేటీకరించుకోవాలని కేంద్రం గట్టిగానే నిర్ణయం తీసుకుంది. ఇదేమీ కుదరకపోతే… ఏకంగా వాటిని మూసివేయాని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
Also Read: ఏపీలో ఇక ‘పుర’ పోరు.. సోమవారమే నోటిఫికేషన్?
నిజానికి నిర్ణయం ప్రధాని మోదీదే అయినప్పటికీ.. సదరు కమిటీ దాన్ని ఓ పద్ధతిలో నరుక్కొస్తుంది అంతే.. ఇప్పటికే బోలెడన్ని కంపెనీల్లో కేంద్రం తన పెట్టుబడులను వాపసు తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం లోగా.. పై పద్ధతుల్లో సుమారు 1.75 లక్షల కోట్ల ఆదాయాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టకున్న కేంద్రం అసలు వెనక్కి తగ్గుతుందా..? అన్నది సందేహం. ఇప్పుడు విశాఖ పట్నం ఉక్కు పరిశ్రమ విషయంలోనూ జరిగేది అదే.
Also Read: పెద్దిరెడ్డి గడ్డపై నిమ్మగడ్డ పర్యటన
కాకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఓ వెసులుబాటు ఉంది. అదేమిటంటే.. ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి మరీ అంత ఘోరంగా లేదు. అప్పుడప్పుడూ నష్టాలు వస్తున్నా.. చాలా సార్లు లాభాల బాటలో నడుస్తోంది. కాకుంటే.. ఈ ఫ్యాక్టరీకి సొంతంగా ఇనుప గనులు లేకపోవడమే ప్రధానమైన లోపం. గనులను కేటాయిస్తే.. త్వరలోనే లాభాల బాట పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా.. తప్పులేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అయితే ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై నడవాలి. అవసరమైతే.. రాజీనామాలు చేస్తామని చెప్పటం కాదు.. వెంటనే విశాఖ జిల్లాలోని ప్రజా ప్రతినిధులాంతా.. రాజీనామాలు చేయాలి.కేంద్రంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇందుకు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి ముందుండి ఉద్యమాన్ని నడిపించాలి. అప్పుడే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును కోల్పోవాల్సిందే..