Homeఆంధ్రప్రదేశ్‌Suman on Y S Jagan Govt: ఇంకో రెండు సార్లు జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ట‌.....

Suman on Y S Jagan Govt: ఇంకో రెండు సార్లు జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ట‌.. సుమ‌న్‌పై విరుచుకుప‌డుతున్న నెటిజ‌న్లు..!

Suman on Y S Jagan Govt: ప్రస్తుతం ఏపీలో జగన్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకు పోవడంతో జగన్ పై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి జగన్ పై చాలామంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Suman on Y S Jagan Govt
Suman

ఇలాంటి సమయంలో హీరో సుమన్ చేసిన కామెంట్లు తీవ్ర రాద్ధాంతానికి దారితీస్తున్నాయి. జగన్ కు ఇంకో రెండు సార్లు సీఎంగా అవకాశం ఇస్తే ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు హీరో సుమన్. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశాడు. వరుసగా ఒకే వ్యక్తికి మూడుసార్లు సీఎంగా అవకాశం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ ఎక్కడలేని ప్రేమను కురిపించేశాడు.

Also Read: Janasena-TDP Alliance: ప‌వ‌న్ స్పీచ్‌తో టీడీపీలో కొత్త ఆశ‌లు.. వైసీపీలో అల‌జ‌డి

దీంతో నెటిజన్లు సుమన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్కసారి సీఎం చేస్తేనే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది ఇంకా మూడు సార్లు చేయాలా అంటూ సుమన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగినందుకు ఇచ్చామని.. అందుకు ప్రతిఫలంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశాడని, సంక్షేమ పథకాలు తప్ప.. మరే అభివృద్ధి లేదంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

నవరత్నాలు లాంటి స్కీంలతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందదని.. మరింత అప్పుల్లో కూరుకు పోతుందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే ఎలాంటి ఫామ్ లో లేని సుమన్ చేసిన ఈ కామెంట్ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో కేసీఆర్‌కు సపోర్ట్ గా ఉండే సుమన్.. సడన్ గా జగన్ పై ప్రేమ కురిపించడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.

Also Read: AP Politics: ఆంధ్రప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా పార్టీల ప్లాన్లు?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version