SS Rajamouli Interview: రాజమౌళి.. క్రియేటివిటీకి అండ్ విజువల్ సెన్స్ కి సింబాలిజం, కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్ డెఫినిషన్. రాజమౌళి పాత్రల్లో యాక్షన్ ఉంటుంది. రాజమౌళి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. కాగా జక్కన డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాజమౌళి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.
యాంకర్: నమస్కారం అండి. ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అని టైటిల్ అనుకోక ముందు.. వేరే టైటిల్ ఏమైనా పెట్టాలకున్నారా ?
రాజమౌళి : నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ను మేం మొదట టైటిల్ గా అనుకోలేదు. జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే ‘ఆర్ఆర్ఆర్’ అని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే, అందరికీ అది బాగా నచ్చింది. అందుకే, దాన్నే మా సినిమా టైటిల్ గా పెట్టుకున్నాం.
యాంకర్ : ఈ చిత్రంలో హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ లను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు ?
రాజమౌళి : సహజంగానే అల్లూరి సీతారామరాజు మండే అగ్నిని సైతం తన గుండెల్లో పెట్టుకునే స్వభావం ఉన్న వ్యక్తి అని మనం విన్నాం. ఈ లక్షణాలు చరణ్ లో పుష్కలంగా ఉన్నాయి. చరణ్ కి ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటాడు. అందుకే, చరణ్ ను ఒక హీరోగా తీసుకున్నాను.
యాంకర్ : మరి ఎన్టీఆర్ పాత్ర గురించి ఏమి చెబుతారు ?
రాజమౌళి : అలాగే భీమ్ పాత్ర గురించి కూడా చాలా విన్నాను. ఆ పాత్రలో విప్లవం ఉంటుంది, ఆ పాత్రలో అమాయకత్వం ఉంటుంది. తను ఏ భావోద్వేగాన్ని లోపల దాచుకోలేడు. బయట పెట్టేస్తాడు. అందుకే ఆ పాత్రకు తారక్ కరెక్ట్ అనిపించింది.
యాంకర్ : ఈ ఇద్దరిని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు ?
రాజమౌళి : బ్యాలెన్స్ అనేది హీరోలను బట్టి కాదు, పాత్రలను బట్టి చేశాను. మీరు సినిమా చూస్తున్నప్పుడు అసలు మీకు ఆ ఫీల్ రాదు. ఎవరు ఎక్కువ ? ఎవరు తక్కువ ? అనే ఆలోచన కూడా మీకు కలగదు.
యాంకర్ : రాకపోవచ్చు. కానీ సినిమా చూసి వచ్చాక ఫ్యాన్స్ మధ్య కూడా ఆ చర్చ జరగదు అంటారా ?
రాజమౌళి : జరగకపోయినా (నవ్వుతూ..) మీరు జరిపేలా ఉన్నారు. సినిమాలో హీరోల పాత్రల గురించి మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను. ఈ సినిమాలో ఏ హీరోకి ఏ ఫైట్ పెట్టాలి ? ఏ హీరోకి ఏ పాట ఉండాలి ? లాంటి లెక్కలేమి లేకుండా చేసిన సినిమా ఇది.
యాంకర్ : అంటే, మీకు ఈ విషయంలో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారనే టెన్షన్ లేదా ?
రాజమౌళి : మా చిత్రాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారనే టెన్షన్ లేదు గానీ, కొంత ఆత్రుత అయితే ఉంది. అయినా సినిమాలో ఇద్దరి హీరోల మధ్య ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను.
యాంకర్ : ఏపీలో థియేటర్ల విషయంలో.. టికెట్ రేట్లు విషయంలో కొత్త జీవో వచ్చింది. దాని పై మీ అభిప్రాయం ఏమిటి ?
రాజమౌళి : ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. సీఎం గారిని నేను కూడా రెండు సార్లు కలిశాను. ఇకపోతే కొత్త జీవో విషయంలో కొన్ని విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ, సీఎంగారు మాకు ఫెవరబుల్ గా 5 షోలకు కూడా అనుమతి ఇచ్చారు. ఇది గొప్ప నిర్ణయం.
యాంకర్ : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో మీరు ఏ అంశంలో ఎక్కువ భయపడ్డారు ?
రాజమౌళి : ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరి పాత్రల్లోని ఎమోషన్స్ ను కరెక్ట్ గా రాబట్టగలనా అని మొదట భయపడ్డాను. ఒక పాత్రలోని ఒక ఎమోషన్ ని కరెక్ట్ గా తీసుకురావడం నాకు ఎప్పుడూ టాస్క్ నే.
యాంకర్ : మీ తర్వాత సినిమాని మహేష్ తో చేస్తున్నారు. ఆ సినిమా గురించి ఏమి చెబుతారు ?
రాజమౌళి : ప్రజెంట్ నా మైండ్ ‘ఆర్ఆర్ఆర్’ చుట్టే తిరుగుతుంది. మహేష్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అంటూ రాజమౌళి ఇంటర్వ్యూను ముగించారు.