చంద్రబాబుకు చోటు దక్కినా.. పవన్‌కు దొరకకపాయె

సినిమాల్లో హిట్‌ అయిన పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో అంతపెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తాను ఎంతో మేధావినని చెప్పుకుంటుంటారు ఆయనకు ఆయనే. కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉందని భావిస్తుంటారు. అయితే.. ఆ ఊహలన్నింటికీ ఇప్పుడు చెక్‌ పడింది. కనీసం పవన్‌ను కేంద్రం లెక్కలోకి కూడా తీసుకోలేదని తాజాగా తేలిపోయింది. Also Read: బీజేపీ విషయంలో కేటీఆర్‌‌ రూట్‌ మార్చారా.. అందుకే ఇలా అటాక్ చేస్తున్నారా..? 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన జాతీయ కమిటీలో పవన్ కల్యాణ్ కి […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 1:56 pm
Follow us on


సినిమాల్లో హిట్‌ అయిన పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో అంతపెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తాను ఎంతో మేధావినని చెప్పుకుంటుంటారు ఆయనకు ఆయనే. కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉందని భావిస్తుంటారు. అయితే.. ఆ ఊహలన్నింటికీ ఇప్పుడు చెక్‌ పడింది. కనీసం పవన్‌ను కేంద్రం లెక్కలోకి కూడా తీసుకోలేదని తాజాగా తేలిపోయింది.

Also Read: బీజేపీ విషయంలో కేటీఆర్‌‌ రూట్‌ మార్చారా.. అందుకే ఇలా అటాక్ చేస్తున్నారా..?

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన జాతీయ కమిటీలో పవన్ కల్యాణ్ కి చోటు దక్కలేదు. ఆఖరికి చంద్రబాబుకి కూడా అందులో స్థానం దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా రామోజీరావు, కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు.. తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. తెలుగు సినీ రంగం నుంచి కేవలం రాజమౌళిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఇళయరాజా, ప్రభుదేవా.. ఇలా ఈ లిస్ట్ బారెడుగానే ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 259 మంది ప్రముఖులకు ఇందులో చోటు దక్కింది.

విచిత్రంగా అటు రాజకీయం, ఇటు సినిమా రంగాల నుంచి ఉమ్మడిగా ఉన్న పవన్ కల్యాణ్‌ను మాత్రం కేంద్రం మరచిపోయింది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ మంచి ప్రయారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి వచ్చిన సందర్భంలోనే కాదు, ఢిల్లీలోనూ పవన్‌కు మర్యాదలు బాగానే జరిగేవి. ఆ తర్వాత టీడీపీ అండ చూసుకుని బీజేపీపై సెటైర్లు వేసి అందరికీ దూరమయ్యారు పవన్. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో కలిసినా కూడా గడపదాటిన భార్యలాగానే పవన్‌ను ట్రీట్ చేశారు మోదీ. ప్రధానికి ఎన్ని స్త్రోత్రాలు చేసినా ఫలితం లేకపోయింది.

Also Read: కేరళ సీఎంపై గోల్డ్ ట్రాప్!.. విపక్షాల చేతికి ఆయుధం

రెండోసారి పొత్తు తర్వాత ప్రధాని మోదీతో ఇంతవరకు పవన్‌కు అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు. అటు జీహెచ్ఎంసీలో పోటీకి అవకాశమివ్వలేదు. ఇటు తిరుపతిలో ఇస్తారనే నమ్మకం లేదు. స్థానిక ఎన్నికల్లో పొత్తు విషయంలో కూడా ఎటూ తేల్చకుండా ఒంటరిగానే ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీలో చాలామందికి అవకాశమిచ్చి పవన్‌ను మాత్రం మరచిపోయారంటే బీజేపీ దృష్టిలో జనసేనాని ఎంత పలుచన అయ్యారో అర్థమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్