Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్..

ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరి రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డిల రిమాండ్ ముగిసింది.

Written By: Dharma, Updated On : July 11, 2023 6:13 pm
Follow us on

Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. న్యాయస్థానాల్లో వరుసగా పిటీషన్లు దాఖలవుతున్నాయి. దీనిపై కోర్టులు విచారణ చేపడుతున్నాయి. తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఒక చార్జిషీట్ ను దాఖలు చేసింది. కానీ సాంకేతిక కారణాలు చూపుతూ సీబీఐ కోర్టు దానిని తిరస్కరించింది. సీబీఐ సరిచేసి దాఖలు చేయడంతో కోర్టు స్వీకరించింది. అయితే కోర్టు తిరస్కరణకు గురికావడంతో సీబీఐ ఒక్కసారిగా షాక్ గురైంది. కానీ తరువాత ఉపశమనం పొందింది. మరోవైపు భాస్కరరెడ్డి, పీఏ క్రిష్ణారెడ్డి పిటీషన్లపై విచారణను ఈ నెల 20కు కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరి రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డిల రిమాండ్ ముగిసింది. కానీ సీబీఐ అభ్యర్థన మేరకు ఈ నెల 14 వరకూ కోర్టు పొడిగించింది. సీబీఐ అనుబంధ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటివరకూ రెండుసార్లు అనుబంధ పిటీషన్లు దాఖలు చేసింది. ఆ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించింది. దీంతో పాటు కీలక ప్రజాప్రతినిధి పేరు సైతం ప్రస్తావనకు తీసుకొచ్చింది. ఈ మూడో చార్జిషీట్ మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై దాఖలు చేసింది.

కేసు విచారణలో భాగంగా సీబీఐకి కోర్టు కీలక అనుమతులు ఇచ్చింది. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖలో నిజానిజాలు తేల్చే పనిలో సీబీఐ ఉంది. నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి అడిగింది. వేలిముద్రలు గుర్తించడానికి వీలుగా పరీక్ష చేయడానికి అనుమతులు కావాలని సీబీఐ కోరింది. దీనిపై అనుమతిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో వివేకా ఒత్తిడితో లేఖ రాసినట్టు గుర్తించారు. కానీ ఈసారి మాత్రం వేలిముద్రలను సైతం గుర్తిస్తే కేసు మరింత బిగుసుకుంటుందని సీబీఐ భావిస్తోంది. దీంతో అసలు లేఖ ఎవరు రాశారో తెలిసిపోతుందని సీబీఐ భావిస్తోంది.