Ganji Prasad Murder Case: ఏలూరు జిల్లాలో జరిగిన వైసీపీ నేత హత్య కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు పోలసుల ఎదుట లొంగిపోయారు. ఓ వైపు హతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై ఘటన జరిగిన కొంతసేపటికే ఈ వ్యక్తులు పోలీసుల ఎదుట లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత హత్యకు గ్రూపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో ముగ్గురు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో శనివారం ఉదయం గ్రామాధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. ఉదయం కొంత మంది వ్యక్తులు వచ్చిన ఆయనను కత్తులతో నరికినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే గత కొంత కాలంగా గ్రామంలో అధికార వైసీపీలో వర్గపోరు కొనసాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. ఇక్కడ గ్రూపు రాజకీయాల కారణంగా సొంత పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుడంతో గ్రామంలో కొన్ని సార్లు వివాదాలు చెలరేగాయి.
అయితే గంజి ప్రసాద్ ను అధికార పార్టీలోని ఓ గ్రూపునకు చెందిన వ్యక్తి హత్య చేశాడని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే వెంకట్రావ్ ను అక్కడివారు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆయనపై దాడి చేసినంత పనిచేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే వెంకట్రావ్ కు రక్షణగా ఏర్పడి ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

ఎమ్మెల్యే దాడిపై చర్చ సాగుతుండగానే ముగ్గురు వ్యక్తులు సురేశ్, మోహన్, హేమంత్ లు పోలీసుల ఎదుటలొంగిపోయారు. ఈ హత్యను తామే చేశామంటూ చెప్పారు. వీరు ముగ్గురు బజారియా అనే వ్యక్తికి సన్నిహితులు. గత కొంత కాలంగా గంజి ప్రసాద్ కు, బజారియా కు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే పోలీసులు ఆకోణంలో విచారించే అవకాశం ఉంది. దీంతో వైసీపీ లో తీవ్ర చర్చనీయాంశగా మారింది. అయితే ఈ గ్రూపు రాజకీయాలపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందోనని పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Minister Roja: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా!
Recommended Videos
[…] Uttar Pradesh: ఆమె ఓ స్టేషన్ కు ఎస్సై. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారి. కానీ అకస్మాత్తుగా తన జీవితాన్ని ముగించింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారే ఉన్నపళంగా ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వాడు కాదన్నాడని తనువు చాలించింది. కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి ప్రియుడితో ఉండాలని చూసినా అతడి వేధింపులతో డ్రెస్ లో ఉండగానే ఆత్మహత్య చేసుకుంది. కన్నవారికి కడగండ్లు మిగిల్చింది. కుటుంబాన్ని పోషిస్తుందని భావించిన కూతురే లేకుండా పోవడంతో కన్నవారి కలలు కల్లలయ్యాయి. తమ కూతురు పోలీస్ ఇన్స్ పెక్టర్ అని గర్వంగా చెప్పుకునేందుకు అవకాశం లేకుండా చేసింది. […]