Ntv vs Tv9: ఆమధ్య కేటీఆర్ తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక న్యూస్ ఛానల్ మైంటైన్ చేయడం అంత ఈజీ కాదు అని రజనీకాంత్ అన్నాడు. ఈ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ తెలుగు ప్రజలు ఆయన చెప్పిన మాటను పట్టించుకున్నట్టున్నారు. అందుకే అతడు సారథ్యం వహిస్తున్న టీవీ9 ఛానల్ కు మరొకసారి మొదటి స్థానం కట్టపెట్టారు. ఇటీవల ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అని కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ టీవీ9 ఛానల్ నే ప్రజలు ఎక్కువగా చూశారు. ఆ విషయం తాజాగా వెలువడిన భారత రేటింగ్స్ ప్రతిబింబిస్తున్నాయి. వాస్తవ రోజుల్లో అయితే ఆ న్యూస్ ఛానల్స్ ను జనం పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ ఎన్నికలవేళ ఎందుకో జనం న్యూస్ ఛానల్స్ చూశారు. న్యూస్ ప్రజెంటర్స్ అతని భరించుకుంటూ.. వారు చేస్తున్న తిట్టుకుంటూ.. వారు చూపిస్తున్న స్తుతిని తట్టుకుంటూ న్యూస్ చానల్స్ ను ట్యూన్ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో సహజంగానే రేటింగ్స్ పెరిగాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎగిసి పడినట్టు దూకుడు ప్రదర్శించాయి. అయితే ఇందులో కాస్త చెప్పుకోవాల్సింది ఏంటంటే టీవీ9 గురించి. అది ఈ ఎన్నికల సందర్భంగా గతంలో తాను ఏ స్థానం అయితే అనుభవించిందో.. తిరిగి మళ్లీ దానికి అది దక్కింది. అంటే ఎన్నికల రేసులో ఎన్టీవీ ప్రజెంటేషన్ కంటే టీవీ9 చేసిన హడావిడి తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో నచ్చింది. అందువల్ల ఎన్టీవీ పక్కకు తప్పుకొని టీవీ9 కు దారి ఇచ్చింది. ఫలితంగా టీవీ9 మొదటి స్థానంలోకి మళ్ళీ వచ్చింది. అయితే చాలామంది ఈ రేటింగ్స్ ను పెద్దగా నమ్మరు. దీనికి ప్రాతిపదిక ఏమిటి అని ప్రశ్నిస్తారు.. టీవీ చానల్స్ విషయానికొస్తే ర్యాంకులు మారుతూనే ఉంటాయి కదా అని అంటారు.. అయితే అంతకు ముందు వారం కన్నా గతవారం టీవీ9 ఉద్ధరించింది ఏముంది అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇది వాల్యుబుల్ క్వశ్చన్.. అందుకే రేటింగ్స్ ఒక పట్టాన కొరుకుడు పడవు. అందుకే వాటి హేతుబద్ధత మీద కూడా చాలామందికి సమాధానాలు లభించని ప్రశ్నలే ఉంటాయి.
టీవీ9 75.. ఎన్టీవీ 83
ఇక అంతకుముందు అంటే 48వ వారంలో టీవీ9 75 రేటింగ్స్.. ఎన్టీవీ 83 రేటింగ్స్.. అంటే ఎన్టీవీ 8 పాయింట్లు తేడాతో పై చేయిగా ఉంది. కానీ టీవీ9 106 జి ఆర్ పి లకు ఒకేసారి ఎగబాకింది. గడచిన వారంతో పోల్చితే ఏకంగా 31 పాయింట్లు అధికం. స్థూలంగా చెప్పాలంటే ఒకే వారంలో దాదాపు 40% వృద్ధి. ఇది నమ్మబుల్ గా లేదని చాలామంది ప్రశ్న. అయితే ఇదే సమయంలో ఎన్టీవీ కేవలం 13 పాయింట్లు అదనంగా సంపాదించుకుంది.. అంటే ఈ లెక్కన.. ఎన్నికల కవరేజ్ లో టీవీ9 బాగుందని అనుకోవాలి.. అన్ని చానల్లో రేటింగ్స్ కూడా ఈ ఎన్నికల సందర్భంగా పెరిగాయి.. అయితే ఎవరి రేటింగ్స్ ఎంతలా పెరిగాయి అనేది ఒకసారి పరిశీలిస్తే.. కెసిఆర్ భజన చేసే టీ న్యూస్ ఒక పాయింట్ అదనంగా సంపాదించుకుంది. ఈ పోటీలో టీవీ5 పెద్దగా వృద్ధి నమోదు చేయలేదు.. ఇక ఏబీఎన్, సాక్షి కూడా సేమ్ రేటింగ్స్.. అయితే టీవీ9 కంటే మూడో వంతు దూరంలో ఉన్నాయి. డిసెంబర్ ఫస్ట్ వరకే అంటే 49వ వారం వరకే ఈ రేటింగ్స్.. ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ మూడో తారీకు.. కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినిపించిన నిరసన స్వరం.. ఇవన్నీ కూడా 50వ వారంలో వస్తాయి.. సో వచ్చేవారం మరింత ఆసక్తికరమైన రేటింగ్స్ ఉండే అవకాశం ఉందని మీడియా ప్రతినిధులు అంటున్నారు.. ఒకవేళ జనం మళ్ళీ ఎన్టీవీ వైపు మొగ్గుచూపితే టీవీ9 రెండవ స్థానంలోకి పోవాల్సి ఉంటుంది.. ఇక మిగతా చానల్స్ రేటింగ్స్ లో పెద్దగా మార్పు ఉండే అవకాశం ఉండకపోవచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More