Seethakka: గిరిజన ప్రాంతాల్లో వసతుల విషయంలో ప్రభుత్వాలు చెబుతున్న గణాంకాలకు.. వాస్తవ పరిస్థితికి అస్సలు పొంతన ఉండదు. ఇప్పటికీ రవాణా కష్టాల్లో బతుకు బండి లాగిస్తున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సరైన రోడ్డు ఉండదు. మౌలిక వసతులు సైతం గిరిజనులు ఎరుగరు. ప్రభుత్వాలు మాత్రం అంత సవ్యంగా ఉన్నట్లు చెబుతుంటారు. అయితే ప్రజా ప్రతినిధులు దృష్టిసారించే గ్రామాలు మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కోవలోకి వస్తుంది జగ్గన్నపేట గ్రామం. మొన్నటి వరకు ఆ ఊరు ఎక్కడ ఉందో తెలియనట్టుగా అధికారులు ఉండగా.. ఇప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి ఆ గ్రామం పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. మంత్రి సీతక్క సొంత గ్రామం కావడమే అందుకు కారణం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి సీతక్క గెలుపొందిన సంగతి తెలిసిందే. రేవంత్ క్యాబినెట్లో ఆమె మంత్రి అయ్యారు కూడా. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.అయితే మంత్రి సీతక్క స్వగ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. రూట్ సర్వే చేశారు. బస్సు నడిపేందుకు నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీతక్క విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు ఆర్టీసీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. చాలాసార్లు బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె అడిగిన అప్పటి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు సీతక్క మంత్రి కావడంతో స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. దీంతో జగ్గన్నపేట గ్రామస్తులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమకు ఉచిత బస్సు సౌకర్యం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల వారు సైతం తమ రూట్లో బస్సులు వేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Seethakka became a minister a bus came to her village
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com