బీజేపీలోకి తుమ్మల నాగేశ్వరరావు?

గులాబీ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోందా? దుబ్బాక ఓటమితో అది ఎక్కువ అవుతోందా.? అసంతృప్తులంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు త్వరలో బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఆ ప్రచారం మరింత ఎక్కువైంది. రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా రాజకీయ అనుచరుల్లో.. ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ […]

Written By: NARESH, Updated On : November 18, 2020 11:10 am
Follow us on

గులాబీ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోందా? దుబ్బాక ఓటమితో అది ఎక్కువ అవుతోందా.? అసంతృప్తులంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు త్వరలో బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఆ ప్రచారం మరింత ఎక్కువైంది. రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా రాజకీయ అనుచరుల్లో.. ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

Also Read: ‘గోరటి’ కలం నుంచి ఇకపై వచ్చేది కేసీఆర్ నామస్మరణేనా?

అయితే ఈ ప్రచారంపై తుమ్మల ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తుమ్మల బీజేపీలో చేరనున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. ఆయన నోరు తెరిస్తే గానీ ఈ ప్రచారంపై క్లారిటీ వచ్చేలా లేదు.

తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ నేత. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఖమ్మంలో తిరుగునేతగా మారాడు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాడు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో తమ్మల ఓటమి చెందినా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో నాలుగేళ్లు రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగడంతోపాటు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. పార్టీలో తాను పెంచి పోషించిన నేతలు తన ఓటమికి పనిచేయడంతో 2018 ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయాడు. మంత్రిగా ఉండి కూడా, గత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మల నాగేశ్వర్ రావు దారుణంగా ఓడిపోవడంతో పరపతి దెబ్బతింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవీ పొందలేదు. అయితే ఓడిపోయిన నేతలను, ముఖ్యంగా సీనియర్లను రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారు. దీంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది.

Also Read: మహిళా ఆత్మహత్యాయత్నం కలకలం..! రఘునందన్ పై ఫిర్యాదు?

తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో టీఆర్ఎస్ లో తుమ్మల రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలోనే తుమ్మల బీజేపీలోకి చేరుతారనే ప్రచారం మొదలైంది..

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్