ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టోల్ ‌ప్లస్‌ ఇండియా […]

Written By: Navya, Updated On : November 17, 2020 8:01 pm
Follow us on


ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టోల్ ‌ప్లస్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మొత్తం 150 ఉద్యోగాలు ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్, బెంగళూర్ లలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాళ్లకు టైపింగ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే వాళ్లు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇంజనీరింగ్ డిగ్రీ పాసైన వాళ్లు మాత్రం ఈ ఉద్యోగాలు చేయడానికి అనర్హులు. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి టైపింగ్ బాగా వచ్చిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు హైదరాబాద్ లో నెలకు 15 వేల రూపాయల వేతనం, బెంగళూరులో 17,000 రూపాయల వేతనం లభిస్తుంది. 18 సంవత్సరాల పై బడిన వాళ్లు ఈ నెల 20వ తేదీలోగ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.