TTD Board Members: ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 75 మందితో బోర్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో 25 మంది ప్రధాన ట్రస్టుగాను మిగతా 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగాను నియమించేందుకు సిద్దమైంది. దీంతో ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలకు సైతం స్థానం దక్కింది. ఇందులో తెలంగాణ, మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక లకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. జగన్ అనుకున్న విధంగా కార్యవర్గాన్ని నియమించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కోస్తాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, కోస్తాంధ్ర నుంచి కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్, రాయలసీమ నుంచి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడడ్ి, ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వర్ రావు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ లను తిరిగి కొనసాగించాలని భావించారు.
తెలంగాణ నుంచి కల్వకుర్తి విద్యాసాగర్, మారంశెట్టి శ్రీరాములు, పారిశ్రామిక వేత్త పార్థసారధి రెడ్డిలను గుర్తించారు. యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావును కూడా ఎంపిక చేశారు. మహారాష్ర్ట నుంచి సీఎం ఠాక్రే సూచన మేరకు శివసేన కార్యదర్శి మిలింద్, కర్ణాటక నుంచి పోకల అశోక్ కుమార్, శంకర్, శశిధర్, డాక్టర్ కేతన్ దేశాయ్ పేర్లను ఓకే చేశారు.
తమిళనాడు నుంచి ఎమ్మెల్యే నంద కుమార్, కన్నయ్య, జీవన్ రెడ్డి, సౌరభ్, రాజేశ్ శర్మపేర్లు ఖరారయ్యాయి. శంకర్, విశ్వనాథ్ రెడ్డిలతో పాటు 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభ్యులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మిగిలిపోయిన 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితా పై తుది కసరత్తు చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో మొత్తం కూర్పు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ప్రతి సభ్యుడి బయోడేటా తో పాటు వారి ట్రాక్ రికార్డు ఆధారంగా సభ్యులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.