https://oktelugu.com/

Andhra Pradesh:తన ప్రేమ కాదన్నందుకు బాలిక ఏం చేసిందంటే?

Andhra Pradesh: సామాజిక మాధ్యమాల ప్రభావంతో చెడు అలవాట్లకు గురవుతున్నారు. ఆకర్షణకు లోనై జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు. ఎదిగే వయసులో ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. జీవితంలో ఎన్నో ఆశలతో పైకి రావాలని కోరుకునే బదులు ప్రేమ మోజులో పడిపోతున్నారు. తెలిసీతెలియని వయసులో ఆకర్షణ వైపు మొగ్గుతున్నారు. ప్రేమ పేరుతో పెడదారి పడుతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడి కోసం తనువు చాలిస్తున్నారు. కన్నవారికి శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రకాశం జిల్లా బాదినేనిపల్లి ఎస్సీ పాలెంకు చెందిన బాలిక(16) […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2021 / 06:20 PM IST
    Follow us on

    Andhra Pradesh: సామాజిక మాధ్యమాల ప్రభావంతో చెడు అలవాట్లకు గురవుతున్నారు. ఆకర్షణకు లోనై జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు. ఎదిగే వయసులో ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. జీవితంలో ఎన్నో ఆశలతో పైకి రావాలని కోరుకునే బదులు ప్రేమ మోజులో పడిపోతున్నారు. తెలిసీతెలియని వయసులో ఆకర్షణ వైపు మొగ్గుతున్నారు. ప్రేమ పేరుతో పెడదారి పడుతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడి కోసం తనువు చాలిస్తున్నారు. కన్నవారికి శోకాన్ని మిగుల్చుతున్నారు.

    ప్రకాశం జిల్లా బాదినేనిపల్లి ఎస్సీ పాలెంకు చెందిన బాలిక(16) కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న ఓ యువకుడిని ప్రేమించింది. కానీ అతడు మాత్రం ఆమె ప్రేమను మాత్రం తిరస్కరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తనువు చాలించాలని నిర్ణయించుకుంది. గ్రామ సమీపంలోని పులివాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు ఎంతకి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలిక శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెను సదరు యువకుడే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ప్రేమ కారణంతోనే తమ కుమార్తె బలైందని తల్లిదండ్రులు వాపోతున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుందని విలపిస్తున్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అకారణంగా చనిపోవడానికి బాధ్యులైన వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.