Ganguly Dhoni: భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బలమైన టీంను, కత్తిలాంటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చి బలమైన పునాదిని గంగూలీ వేస్తే.. ఆ పునాదిపై అంతే బలంగా నిలబడి భారత్ కు మూడు ప్రపంచకప్ లు అందించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి దక్కుతుంది. మరి వీరిద్దరూ ఎవరు గొప్ప అంటే ఖచ్చితంగా చెప్పలేం..
కానీ మన వీరూ భాయ్ చెబుతానంటున్నాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎవరు గొప్ప కెప్టెన్ అంటే వివరిస్తున్నాడు. గంగూలీ టీమిండియాను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తే.. అదే జట్టును మరొకరు ప్రపంచ చాంపియన్ గా నిలబెట్టారని వీరూ చెబుతున్నారు. ఇందులో ఎవరినీ తక్కువ చేయడానికి లేదని స్పష్టం చేస్తున్నారు.
గంగూలీ, ధోని ఇద్దరూ గొప్ప సారథులు అని.. ఎవరికి వారే ప్రత్యేకమని వీరూ అభిప్రాయపడ్డారు. విప్కతర పరిస్థితుల్లో టీమిండియాను ఏకతాటిపైకి తెచ్చి యువకులకు, నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్ కు తీర్చిదిద్దిన ఘనత గంగూలీ సొంతమని వీరూ చెబుతున్నారు. టీమిండియా విదేశాల్లో ఎలా గెలవాలో చూపించింది గంగూలీనేనన్నాడు.
ఇక ధోని కెప్టెన్సీ చేపట్టే సమయానికే టీమిండియా బలంగా గొప్ప జట్టుగా ఉందని.. అదే అతడికి కలిసి వచ్చిందని వీరూ చెబుతున్నారు. ధోనికి కొత్త జట్టును తయారు చేయడంలో పెద్ద కష్టం కాలేదని వివరిస్తున్నాడు. ఇద్దరూ గొప్ప సారథులు అని.. నా ఓటు మాత్రం గంగూలీకేనని వీరూ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.