Gautam Adani: తాడి దన్నే వాడి తలదన్నే వాడుంటాడంటారు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయని తెలిసిందే. ఇన్నాళ్లు దేశంలోనే అత్యంత సంపన్నుడెవరంటే ఠక్కున సమాధానం చెప్పేవారు ముఖేష్ అంబానీ అని. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన స్థానాన్ని మరో వ్యక్తి ఆక్రమించాడు. ఆయనే గౌతమ్ అదానీ. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్న ముఖేష్ అంబానీ మరో అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం ఏర్పడింది.

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద 118 బిలియన్ డాలర్లకు చేరడంతో ఏప్రిల్ 4న 100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి మారారు. దీంతో టాప్ 10 గ్లోబల్ బిలియనీర్స్ జాబితాలో చేరడం తెలిసిందే. ఇటీవల కాలం వరకు ఆసియా, ఇండియా కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీ స్థానాన్ని గౌతమ్ అదానీ సొంతం చేసుకోవడం గమనార్హం. 118 బిలియన్ డాలర్లతో ఇండియాలో 6వ స్థానంలో కొనసాగుతున్నారు.
Also Read: Tirumala: తిరుమలకు ఇక సామాన్య భక్తులు వెళ్లడం కష్టమే?
ముఖేష్ అంబానీ 11వ స్థానంలోకి వెళ్లారు. అదానీ సంపద మన కరెన్సీలో రూ.9 లక్షల కోట్లు గా ఉంది. దీంతో ముఖేష్ అంబానీని దాటేసిన ఘనత అదానీ సొంతమైంది. రోజురోజుకు పెరుగుతున్న సంపదతో అదానీ దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో మరింత సంపద పెరిగి ఆయన ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఎదిగినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. వారంలోనే 18 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతోనే గూగుల్ వ్యవస్థాపకుడు లారేఫేజ్, సర్గే బ్రిన్ లను కూడా దాటేయడం తెలిసిందే.

దేశంలోనే ధనవంతుడిగా అదానీ రికార్డు సృష్టించారు. 57 బిలియన్ డాలర్లతో అదానీ కుబేరుడిగా ఎదిగారు. 100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. పెరుగుతున్న సంపదతో అదానీ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సంపద ఏ ఒక్కరి సొత్తు కాదు ఎవరు ఎక్కువ కష్టపడితే వారి చెంతకు చేరుతుందనే సామెతను నిజం చేస్తూ అదానీ కుబేరుడిగా దూసుకుపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు.
Also Read:Jagan New Cabinet: ఫస్ట్ టైం బతిమిలాడుతున్న జగన్.. ఎందుకో తెలుసా?