
లాక్ డౌన్ తో ఆదాయ వనరులు మూసుకు పోయి ఇబ్బంది పడుతున్న జనంపై ఇప్పటికే మద్యం ధరలు, పెట్రోల్ ధరలు పెంచి భారం మోపిన ప్రభుత్వాలు ఇక ఆర్టీసీ ధరలు పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. ఎప్పుడు ఆర్టీసీ బస్సులను నడిపిన 50 శాతం మేరకు ధరలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్
బస్సు సామర్ధ్యంలో 50 శాతం ప్రయాణికులతో మాత్రమే నడుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, లాక్‌డౌన్ వల్ల ఆర్టీసీ రూ 750 కోట్ల మేర ఆదాయం కోల్పోవడంతో.. చార్జీలు పెంచక తప్పదని అధికారులు అంటున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రీన్ జోన్లలో బస్సులను నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి 22 నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, మెడికల్ స్టాఫ్, కార్గో సర్వీసుల కోసం మాత్రమే నడుపుతున్నారు. ఇందులో కార్గో సర్వీసులకే చార్జీలు చెలిస్తున్నారు. సంస్థకు రోజుకు రూ.12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు వచ్చేది. మార్చి 22 నుంచి ఈనెల 15వ తేదీ వరకు 750 కోట్ల ఆదాయం కోల్పోయింది.
ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!
సమ్మె సమయంలో రెండు నెలలు బస్సులు పెద్దగా నడవకపోవడంతో ఇంతేస్థాయిలో ఆదాయం కోల్పోయింది. బస్సులు నడవకున్నా 50 శాతం జీతాలతోపాటు, పన్నులు, ఆర్టీసీ అప్పుల వడ్డీలు కట్టక తప్పడంలేదు.
గ్రామీణ ప్రాంతాలలో ఇది వరలో రద్దీ సమయంలో సామర్థ్యంపై మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొనేవారు. కానీ ఇప్పుడు 25 మందికి మించి ఎక్కించుకోవడానికి వీలుండదు. దానితో అన్ని బస్సులు నడిపినా రోజుకు రూ.5 కోట్లకు మించి ఆదాయం రావడం కష్టం కాగలదని భావిస్తున్నారు.
డిసెంబర్ 3 నుంచి కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున బస్సు చార్జీలు పెంచారు. దీంతో ఆర్టీసీకి ఏటా 752 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అన్నీ పోగా రోజుకు సగటున కోటి వరకు లాభం వచ్చేంది. లాక్‌డౌన్ వల్ల పరిస్థితి మొదటికి వచ్చింది.