
రకుల్ ప్రీత్ సింగ్ చిత్రసీమలో దశాబ్దకాలంగా సత్తాచాటుతోంది. ఇప్పటికే ఈ అమ్మడికి 30ఏళ్లు దాటిపోయాయి. ఇటీవల ఆమె చేసిన సినిమాలు అనుకున్నంత విజయం సాధించడకపోవడంతో ఆఫర్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఎక్కడికి వెళ్లిన పెళ్లెప్పుడంటూ ప్రశ్నలు విన్నిస్తున్నాయి. దీనిపై రకుల్ స్పందిస్తూ తనకింకా పెళ్లీడు రాలేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే అని చెబుతోంది. అయితే ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రావడంపై రకుల్ తల్లి క్లారిటీ ఇచ్చారు. రకుల్ ప్రస్తుతం సినిమాలు, బిజినెస్ లతో బీజీగా ఉందని తెలిపింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన రకుల్ కు లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ అయిపోయాక చూద్దాంలే అంటోంది. తాను ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడు చేసేందుకు రెడీ అని.. అంతేకాకుండా తాను ఎవరినైనా ఇష్టపడితే అతడిని ఇచ్చి పెళ్లి చేస్తామని రకుల్ తల్లి చెబుతోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్-2’లో, నితిన్ కు జోడీగా ఓ మూవీలో నటిస్తుంది. హిందీలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటిస్తుంది.
లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్
ఇండస్ట్రీలో రకుల్ కంటే ముదురుభామలు చాలా మందే ఉన్నారు. నయనతార, త్రిష, కాజల్, అనుష్క తదితరులు ఉన్నారు. వీరి లిస్టు పెద్దదిగానే ఉంది. వీరంతా 30ఏళ్లు పైబడినవారే. వీళ్లందరికీ పెళ్లి కాకుండా తాను చేసుకుంటే బాగుండదేమోనని రకుల్ భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెబుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో ముదురుభామలకు డిమాండ్ ఉండటంతో వీళ్లంతా పెళ్లి గురించి ఆలోచించడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.