Ravi Teja and Vijay Devarakonda: సినిమా పరిశ్రమలో ఎవరి స్టార్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక మామూలు బస్ కండక్టర్ చలనచిత్ర రంగాన్ని ఏలిన సంఘటన తెలిసిందే. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్. బస్ కండర్టర్ గా ఉన్న ఆయన స్టైల్ ను చూసి అబ్బురపడిన దర్శకుడు ఆయనను తమిళ చిత్ర రంగానికి పరిచయం చేసి స్టార్ ను చేసిన సంగతి తెలిసిందే. అదే కోణంలో భక్తవత్సలం నాయుడు అని పిలుచుకునే మోహన్ బాబుకు కూడా అనుకోకుండానే సినిమా రంగానికి దగ్గరయ్యారు. ఆయన మొదట నటుడు కావడానికి కూడా చాలా కష్టాలే పడినట్లు తెలుస్తోంది. అప్పట్టో ఇదరికి పోటీ పెడితే అందులో మోహన్ బాబు ప్రతిభ చూపించి సినిమా రంగానికి పరిచయమైనట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు తన కెరీర్ లో మొదట హీరోగా తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ గా తన ప్రస్థానం కొనసాగించారు. అల్లుడుగారు సినిమాతో తిరిగి హీరోగా నిలదొక్కుకున్నాడు. దీంతో మోహన్ బాబు తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి కూడా మొదట హీరోగా పరిచయమైనా తరువాత స్టార్ ఇమేజ్ రాకపోవడంతో క్యారెక్టర్, విలన్ గా నటించి మెప్పించిన సంగతి ప్రేక్షకులకు విధితమే. దీంతో చలనచిత్ర పరిశ్రమలో కళాకారులు ఎన్నో కష్టాలు అనుభవించిన వారే కావడం గమనార్హం.
Also Read: Venkatesh Chanti Movie: వెంకటేష్ చంటి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ప్రస్తుత తరంలో రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి వారు కూడా తమ కెరీర్ ను కొనసాగించేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడినట్లు తెలుస్తోంది. రవితేజ దర్శకుడిగా కావాలని సినిమా రంగంలోకి అడుగుపెట్టినా తనలో నటుడు దాగి ఉన్నట్లు గుర్తించి వేషాలు రావడంతో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా జీవితం ఆరంభించి తరువాత హీరోగా రాణించిన సంగతి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ కూడా ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. తరువాత హీరోగా మారి విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు.

ఇంకా శ్రీకాంత్, శర్వానంద్, రాజేంద్రప్రసాద్, కృష్ణం రాజు, ఆర్. నారాయణమూర్తి లాంటి వారు కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రతినాయకులుగా వ్యవహరించి తమ ప్రస్థానాన్ని కొనసాగించారు. కాలం కలిసి రావడంతో వారు హీరోలుగా మారారు. ఇలా సినిమా పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎటు వైపు వెళ్తుందో తెలియడం కష్టమే.
Also Read:Pavithra Lokesh- Naresh: ఆయనతో సహజీవనం చేస్తున్నా.. నరేష్ తో పెళ్లిపై బాంబు పేల్చిన పవిత్రలోకేష్