https://oktelugu.com/

మావోయిస్టుల కట్టడికి పోలీసుల వినూత్న ప్లాన్‌

ఎంతోకాలంగా కనుమరుగైన మావోయిస్టులు ఉనికి గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేఫథ్యంలో రాష్ట్ర డీపీ మహేందర్‌ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లలో ప్రత్యేకంగా రెండు రోజులు పర్యటించారు. స్థానిక, కూంబింగ్‌ పోలీసులను అలర్ట్‌ చేశారు. ఆ తరువాత కొందరు మావోయిస్టులు మృతి చెందడం చూస్తే మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అర్థమవుతోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 12:04 pm
    mao

    mao

    Follow us on

    mao

    ఎంతోకాలంగా కనుమరుగైన మావోయిస్టులు ఉనికి గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేఫథ్యంలో రాష్ట్ర డీపీ మహేందర్‌ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లలో ప్రత్యేకంగా రెండు రోజులు పర్యటించారు. స్థానిక, కూంబింగ్‌ పోలీసులను అలర్ట్‌ చేశారు. ఆ తరువాత కొందరు మావోయిస్టులు మృతి చెందడం చూస్తే మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అర్థమవుతోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ తనిఖీలు చేపడుతున్నారు.

    Also Read: రేపు నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక.. కవిత గెలుపు ఖాయమేనా?

    ఇదిలా ఉండగా మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్ట్టుకుంది. ఇందుకోసం పోలీసులు ఉన్నతాధికారులను నియమించి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈమేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఓస్డీగా ఉదయ్‌కుమార్‌రెడ్డిని నియమించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు సైతం అవసరం ఉన్న చోట ఓస్డీలను నియమించాయి.

    మరోవైపు రిటైర్డ్‌ అధికారులను సైతం ప్రభుత్వాలు రంగంలోకి దించుతున్నాయి. పీపల్స్‌వార్‌ కార్యకలాపాలను నిరోధించే అనుభవం ఉన్న విశ్రాంత పోలీసు ఉన్నతాధికారుల సేవలను వినియోగించుకోనున్నారు. మారుమూల ప్రాంతాల యువకులను మావోయిస్టులు ఆకర్షిస్తూ పార్టీలో నియమించుకుంటున్నారని, రిక్రూట్‌మెంట్‌ బలోపేతం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారి కార్యకలపాలను నామరూపాలు లేకండా పకడ్బందీ ప్రభుత్వం ఈ దిశగా అధికారులను నియమిస్తోంది.

    Also Read: దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుస్తుందా..? బలాబలాలు ఏమిటీ

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే ఖమ్మం జిల్లాలోనూ మరోకను మరణించారు. దీంతో మావోయిస్టులు మళ్లీ చెలరేగే అవకాశం ఉన్నందున అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో పోలీసు ఉన్నతాధికారుల పనిచేయనున్నారు. అయితే మావోయిస్టు పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా భాస్కర్‌ లక్ష్యంగా పోలీసులు చేపడుతున్నా ఆయన ఇంతవరకు చిక్కలేదు. మరి ఓఎస్డీల నియామకంతో ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి…