https://oktelugu.com/

మిహీకాతో ప్రేమాయణంపై రానా ఏమన్నాడంటే?

టాలీవుడ్ స్టార్ రానా దగ్గుపాటి స్టార్ హీరోగా దూసుకెళుతున్నాడు. ‘బాహుబలి’లో బళ్లలదేవుడిగా అలరించిన రానా క్రేజ్ అమాంతం వరల్డ్ వైడ్ గా పాకింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేందుకు రానా ఎప్పుడు ముందుంటాడు. ఇటీవల రానా నటించిన ‘అరణ్యం’ మూవీలోనూ మావాటిగా నటించి అందరి ప్రశంసలు పొందాడు. Also Read: రాజమౌళి ఔట్.. మహేష్ నెక్ట్స్ మూవీ ‘త్రివిక్రమ్’తోనే? ఇటీవలే రానా దగ్గుపాటి ఓ ఇంటివాడయ్యాడు. మిహీకా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రానా చెప్పేంత వరకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 11:10 AM IST
    Follow us on

    టాలీవుడ్ స్టార్ రానా దగ్గుపాటి స్టార్ హీరోగా దూసుకెళుతున్నాడు. ‘బాహుబలి’లో బళ్లలదేవుడిగా అలరించిన రానా క్రేజ్ అమాంతం వరల్డ్ వైడ్ గా పాకింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేందుకు రానా ఎప్పుడు ముందుంటాడు. ఇటీవల రానా నటించిన ‘అరణ్యం’ మూవీలోనూ మావాటిగా నటించి అందరి ప్రశంసలు పొందాడు.

    Also Read: రాజమౌళి ఔట్.. మహేష్ నెక్ట్స్ మూవీ ‘త్రివిక్రమ్’తోనే?

    ఇటీవలే రానా దగ్గుపాటి ఓ ఇంటివాడయ్యాడు. మిహీకా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రానా చెప్పేంత వరకు కూడా అతడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనిగానీ.. పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఎక్కడా రాలేదు. దీంతో రానా-మిహికా బజాజ్ లవ్ మ్యాటర్ తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తాజాా రానా తన లవ్ మ్యాటర్ పై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు.

    తాజాగా రానా దగ్గుపాటిని బాలీవుడ్ తార నేహా ధూపియా తన షో #NoFilterWithNehaaలో ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా రానా-మిహీకా బజాజ్ ప్రేమ విషయంపై ఆరా తీసింది. దీంతో ఈ ఇంటర్య్వూలో రానా తన ప్రేమ.. పెళ్లి సంగతులపై ఓపెన్ అయ్యాడు. తనకు మిహీకా చాలాకాలంగా తెలుసనని చెప్పాడు. తన చెల్లెలు అశ్రిత((విక్టరీ వెంకటేష్ కూతురు)తో మిహీక స్కూలుకు వెళ్లేదని.. అప్పటి నుంచి తనకు ఆమె పరిచయం అని చెప్పాడు.  పరిచయం కాస్తా ప్రేమగా మారిందని చెప్పుకొచ్చాడు. అయితే తన లవ్ సంగతి తన చెల్లిలికి తెలుసనని.. తాను కూడా తన లవ్ కు హెల్ప్ చేసిందంటూ చెప్పుకొచ్చాడు.

    Also Read: ప్రేమ పక్షులుగా మారుతున్న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు

    ఇక లాక్డౌన్ సమయంలోనూ మిహీకాతో మాట్లాడేవాడనని చెప్పారు. ఓరోజు తనను ప్రపోజ్ చేయగా తాను ఓకే చెప్పిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఆ వెంటనే రాగా దగ్గుపాటి తన సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ చెప్పాడు. 2020 మే 12న రానా తన ఫియాన్సీ మిహీకాను అభిమానులకు రానా పరిచయం చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే(ఆగస్టు 8న) కొంతమంది బంధువుల సమక్షంలో వీరిద్దరి రామానాయుడు స్టూడియోలో వివాహం చేసుకున్నారు.