TS Liquor Price: ప్రభుత్వాలకు మద్యం వ్యాపారమే గుండెకాయ. ఆదాయం మొత్తం దాని నుంచే రావడం గమనార్హం. సంక్షేమ పథకాలు సజావుగా సాగాలన్నా ప్రభుత్వ బండి కదలాలన్నా మద్యం మీద ఆధారపడటమే అందుకే మద్యం వ్యాపారం తగ్గితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోంది. ఫలితంగా పనులు ముందుకు సాగవు. ఇప్పుడు అలాంటి కష్టమే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చి పడింది. ఇన్నాళ్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లిన మద్యం వ్యాపారం ఇటీవల కాలంలో తగ్గింది. దీంతో ఆదాయంపై ప్రభావం పడుతోంది. ఎలాగైనా ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో అబ్కారీ శాఖ చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. అక్కడ ధరలు తగ్గించడంతో దాని ప్రభావం ఇక్కడ పడిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే మనం కూడా ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో ధరలు తగ్గడంతో అక్కడి నుంచే మద్యం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మనం కూడా మన వ్యాపారం సజావుగా సాగాలంటే ధరలు తగ్గించాల్సిందే అని గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం.
Also Read: రేవంత్ రెడ్డికి సొంత పార్టీ వారి నుంచే ముప్పు?
గొర్రె బలిస్తే గొల్లోనికే లాభం అన్నట్లు మద్యం ధరలు తగ్గితే మందుబాబులకు ప్రభుత్వానికే మేలు. మనకు ప్రత్యక్షంగా ఏం లాభం కలగకున్నా పరోక్షంగా ప్రభుత్వానికి ప్రయోజనం కలగడం ద్వారా మన ఆదాయం పెరగడం ఖాయమే. దీని కోసం తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ధరలు ఎంత మేర తగ్గించాలి? వేటిపై తగ్గించాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది.
బీర్ల అమ్మకాలు కూడా తగ్గాయి. ధరల ప్రభావం ఎక్కువగా ఉన్న లిక్కర్ పై మాత్రం తగ్గించనున్నట్లు సమాచారం. కానీ బీర్లపై కూడా ధరలు తగ్గిస్తే డిమాండ్ పెరగనున్నట్లు ఆలోచిస్తోంది. మొత్తానికి ధరల ప్రభావంతో మద్యం వ్యాపారం కుదేలైపోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. ధరలు ఎలాగైనా తగ్గించి మద్యం వ్యాపారాన్ని మళ్లీ గాడిలో పడేయాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో మద్యానికి మళ్లీ పాత రోజులు వస్తాయనే ఆశతో ముందుకు వెళ్తోంది.