Hyderabad Drug Case: తెలంగాణలో డ్రగ్స్ మాఫియా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పట్టుబడిన వారిలో అందరు సెలబ్రిటీలే ఉండటంతో ఎవరిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెబుతోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. నగరంలోని పబ్ యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టొద్దని సూచిస్తున్నారు. సొంత పార్టీ నేతలున్నా లెక్కచేయొద్దని చెబుతున్నారు.

ప్రభుత్వం ఇదివరకే డ్రగ్స్ మాఫియాను రూపుమాపాలని సూచించినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతోనే డ్రగ్స్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భావించినా కుదరలేదు. దీంతో డ్రగ్స్ వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోతోంది. మొదట బాధితులుగా చేరిన వారు తరువాత వ్యాపారస్తులుగా మారుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా మారడం గమనార్హం. దీంతో డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
గతంలోనే సినిమా కథానాయకులు పట్టుబడినా అది కూడా కంచికి చేరలేదు. మధ్యలోనే కేసును తప్పుదోవ పట్టించారు ఇప్పుడు కూడా అదే దారిలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మంత్రి సమీక్ష నిర్వహించి ఎంతటి వారైనా అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని చెబుతున్నందున కేసు పురోగతి సాధిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నా కొలిక్కి వస్తుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం వెనుక పబ్బుల పాత్ర గణనీయంగా ఉంది. దీంతో వాటిలో యథేచ్ఛగా మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ పేరుతో ఎంజాయ్ చేసేందుకు డబ్బున్న వాళ్లు పబ్బులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ వ్యాపారం అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పబ్సులపై చర్యలు తీసుకుని డ్రగ్స్ వ్యాపారం ఇకపై నడవకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
[…] TRS Flexis In Delhi: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలతో హోరెత్తిస్తున్నారు. అన్ని హిందీలోనే ఏర్పాటు చేశారు. ఉత్తరాదిలో అందరు హిందీలోనే మాట్లాడటంతో కేసీఆర్ ఫ్లెక్సీలు అక్కడి వారికి అర్థమయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కూడా తన ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అన్ని ఫ్లెక్సీలు తెలుగులో కాకుండా హిందీలో ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాదిలో పట్టుకోసం పాకులాడుతున్నారని తెలుస్తోంది. […]