Dil Raju: టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ కాబట్టి, ఆమె డేట్లు కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూడాల్సి వస్తోంది. అందుకే పూజా డేట్స్ కోసం రెండు నెలలు ముందుగానే నిర్మాతలు ఎగబడుతున్నారని… అయినప్పటికీ, పూజా డేట్లు మాత్రం అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. మరి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి.. ప్రస్తుతం పూజా దయ కోసం నిర్మాతలు అర్రులు చాస్తున్నారు.

ఏదో చిన్నాచితకా నిర్మాతలు ఇలా చేస్తే.. పెద్దగా వార్త అయ్యేది కాదు. కానీ.. దిల్ రాజు లాంటి వ్యక్తి కూడా పూజా డేట్లు కోసం ఆమెను పొగుడుతూ మాట్లాడాల్సిన పరిస్థితి రావడం కచ్చితంగా విచిత్రమే. బీస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పూజా హెగ్డేపై నిర్మాత దిల్ రాజు కామెంట్స్ వింటే.. దిల్ రాజు ఎంత లౌక్యంగా మాట్లాడాడో అర్ధం అవుతుంది.
పైగా పూజా మన కాజా అంటూ పేర్కొన్నాడు దిల్ రాజు. దీంతో ఆడియోన్స్ అరుపులతో హోరెత్తించారు. అంతటితో ఆగకుండా ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అంటూ ఆమె లెగ్గు పడితే మూవీ సూపర్ హిట్టే అంటూ బుట్ట బొమ్మని ఆకాశానికి ఎత్తేశాడు రాజు. గతంలో ఎన్నడూ దిల్ రాజు ఒక హీరోయిన్ ను ఈ స్థాయిలో పొగిడింది లేదు.
మొత్తానికి దిల్ రాజు మాటలను బట్టి.. ప్రస్తుతం ‘పూజా హెగ్డే’ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. నిజానికి టాలీవుడ్ లోకి ‘ఒక లైలా కోసం’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ సినిమా పూజ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత ‘ముకుంద’లో యాక్ట్ చేసినా అది ప్లాప్ అయింది. మొత్తమ్మీద పూజాకి ఏ మాత్రం కాలం కలిసి రాలేదు.

అప్పుడు ఇదే దిల్ రాజు ను కలవడానికి ‘పూజా హెగ్డే’ రెండు నెలలు రాజు గారి అఫీస్ చుట్టూ తిరిగింది. కానీ.. ఇప్పుడు ఆమె డేట్లు కోసం రాజుగారు మూడు – నాలుగు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పైగా భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాలి. పూజా హెగ్డే’ తన రెమ్యూనరేషన్ ను డబుల్ చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను ఈ టాల్ బ్యూటీ పక్కాగా ఫాలో అవుతుందన్నమాట.