Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. కంటెస్టెంట్లు అంతా హాట్ హాట్ గా ఆడేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కావడంతో బిగ్ బాస్ కూడా చాలా రోమాంటిక్ టాస్క్ లు ఇస్తూ ఆ వర్గం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక ఈ ఓటీటీ షోలో ప్రధానంగా పాత బిగ్ బాస్ రన్నరప్ అయిన ‘అలక రాజా’ అఖిల్.. లేటెస్ట్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ ‘బిందుమాధవి’ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. రెండు వర్గాలుగా ఓటీటీ కంటెస్టెంట్లు చీలిపోయి రంజుగా ఎంటర్ టైన్ చేస్తున్నారు.
అయితే అందరికీ వచ్చే సందేహం ఒక్కటే. ఏంటంటే ఈటీవీలో ప్రతి బుధవారం ‘ఢీ’ డ్యాన్స్ షో వస్తోంది. ఈ బుధవారం కూడా అందులో టీం లీడర్ గా అఖిల్ కనిపించారు. వచ్చే వారం ప్రోమోలో కూడా కనిపించాడు. ఇప్పటికీ మూడు వారాలుగా బిగ్ బాస్ ఓటీటీలో ఉంటున్న అఖిల్ మరి ఎలా ఢీ షోలో కనిపిస్తున్నాడన్న సందేహాలు నెలకొన్నాయి. ఓటీటీకి వెళుతున్నాడని ముందుగానే ఓ నెలరోజుల షోలు చేశాడా? లేక ఓటీటీ నుంచి బయటకు వచ్చి చేస్తున్నాడా? లేదా మూడు నాలుగు వారాల పాటు బిగ్ బాస్ లో పాల్గొని ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యేలా అఖిల్ ప్లాన్ చేసుకున్నాడా? ఈ మేరకు ముందస్తుగానే ఢీ షోను కంప్లీట్ చేశాడా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.
అలక రాజా అఖిల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మూడు వారాలు గడిచినా, ఇంకా ఢీ లో టీమ్ లీడర్ గా కనపడుతూనే ఉండడంలో మతలబు ఏమిటి? అన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. వచ్చే ముందే ఎక్కువ ఎపిసోడ్స్ పూర్తి చేశాడా? లేక కొన్ని వారాలకే కాంట్రాక్ట్ చేసుకొని ఢీ లోకి వచ్చాడా? అన్నది అనుమానంగా మారింది.
ఇదే జరిగితే బిగ్ బాస్ తనని త్వరగా పంపించి వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢీ షో లో అఖిల్ కి బదులు వేరే ఎవర్నీ పెట్టుకోక పోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది… దీంతో అఖిల్ త్వరలోనే ఢీ షోనుంచి ఎలిమినేట్ అవుతాడని భావిస్తున్నారు. లేదా ఢీ షోనే వదిలేసి ఓటీటీకి పరిమితం అవుతాడా? అన్నది వచ్చే ఢీ ఎపిసోడ్ లలో అఖిల్ హాజరును బట్టి తేలనుంది.