
మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అందరికీ ఆశలు ఉన్నాయి. ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు.
Also Read: తెలంగాణలోని ఆ ప్రాంతంలో పందుల పోటీలు.. ఫ్రైజ్ మనీ ఎంతంటే..?
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇప్పటికే అమలులో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా యాదవులు గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 70 వేల యూనిట్లకు కొనసాగింపుగా.. మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి గాను, రానున్న బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సీఎం తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుందని.. దేశంలోనే అధికంగా గొర్రెల జనాభా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీఎం తెలిపారు.
Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!
అలాగే.. చేపల పెంపకం కూడా రాష్ట్రంలో గొప్పగా సాగుతోందని.. మంచి ఫలితాలు కూడా వస్తున్నందునా దాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం చెప్పారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని తెలిపారు. కరోన అనంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారమున్నదని సీఎం తెలిపారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
బడ్జెట్ అంచనాలు కేటాయింపుల్లో విధివిధానాలు ఖరారయ్యాయని.. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఇరిగేషన్ తదితర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్ పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది. బడ్జెట్ మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం తెలిపారు.