https://oktelugu.com/

TS Cabinet Meeting: ప్రజలపై కేసీఆర్ వరాలు.. కేబినెట్ లో కీలక నిర్ణయాలు

TS Cabinet Meeting: హైదరాబాద్ లో తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం అయింది. కీలక నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ర్టంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణయించింది. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త మెడికల్ కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించింది. రాష్ర్టంలో కరోనా పరిస్థితిపై ఆరా తీసింది. రాష్టంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య గురించి తెలుసుకుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. కరోనా […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2021 6:42 pm
    Follow us on

    TS Cabinet Meeting: KCR Key Decisions In The TS Cabinet Meeting

    TS Cabinet Meeting: హైదరాబాద్ లో తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం అయింది. కీలక నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ర్టంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణయించింది. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త మెడికల్ కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించింది. రాష్ర్టంలో కరోనా పరిస్థితిపై ఆరా తీసింది. రాష్టంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య గురించి తెలుసుకుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

    కరోనా నేపథ్యంలో కూడా విద్యాసంస్థల ప్రారంభించడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మాస్కులు ధరించి శానిటైజర్ రాసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. కరోనా వైరస్ నిరోధానికి చేపట్టబోయే చర్యల గురించి తెలియజేసింది. విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టి కరోనా అంటే ఏం కాదనే విషయాన్ని అర్థమయ్యేలా చేయాలని సూచించింది.

    రాష్ర్టంలో ఇప్పటి వరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ డోసులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 2.56 కోట్ల డోసులు వేసినట్లు తెలిపింది. వారిలో 1.45 కోట్ల మందికి మొదటి డోసు, 55.36 లక్షల మందికి రెండో డోసు వేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంల స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందని తెలిపింది. స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందిన తెలిపింది.

    ప్రతి రోజు మూడు లక్షల వరకు టీకాలు వస్తున్నట్లు పేర్కొంది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, దీన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 5200 బెడ్లు అందుబాటులో ఉంచినట్లు సూచించింది. మూడో దశ వస్తే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది.