https://oktelugu.com/

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ భారీ ప్లాన్

-అమిత్ షా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బండి సంజయ్ – గత మూడురోజులుగా అర్ధరాత్రి వరకు సమీక్షల్లో బిజీబిజీ – భారీ జన సమూహంతో సభ నిర్వహించి ‘తెలంగాణ విమోచన దినం’ ఆకాంక్షను చాటేలా సభ నిర్వహణ – బీజేపీ సభను చూసి ప్రభుత్వం వెంటనే అధికారిక దినం ప్రకటించాలి – లేనట్లయితే ఈ సభతోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకాన్ని కల్పించాలి – అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినంను అధికారికంగా జరుపుదాం – గత […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2021 / 08:09 PM IST
    Follow us on

    -అమిత్ షా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బండి సంజయ్
    – గత మూడురోజులుగా అర్ధరాత్రి వరకు సమీక్షల్లో బిజీబిజీ
    – భారీ జన సమూహంతో సభ నిర్వహించి ‘తెలంగాణ విమోచన దినం’ ఆకాంక్షను చాటేలా సభ నిర్వహణ
    – బీజేపీ సభను చూసి ప్రభుత్వం వెంటనే అధికారిక దినం ప్రకటించాలి
    – లేనట్లయితే ఈ సభతోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకాన్ని కల్పించాలి
    – అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినంను అధికారికంగా జరుపుదాం
    – గత మూడు రోజులుగా సభ ఏర్పాట్లపై బండి సంజయ్ అహర్నిశలు కృషి

    Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ భారీ ప్లాన్ చేస్తోంది. ఒక సంచలన ప్రకటనను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పించేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో అధికారంలోకి రాగానే ‘తెలంగాణ విమోచన దినం’ను అధికారికంగా జరిపుతామని అమిత్ షా సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే టీఆర్ఎస్ సర్కార్ డిఫెన్స్ లో పడుతుందని.. అధికారికంగా నిర్వహిస్తుందని భావిస్తోంది. ఇందుకోసం నిర్మల్ లో రేపటి భారీ బహిరంగ సభను వేదికగా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

    పాదయాత్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నడుస్తూ దారి పొడువున్నా సమస్యలు వింటూ ప్రజలు, రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగుల కష్టాలు తెలుసుకుంటూనే గత మూడు రోజులుగా ఒక అతి ముఖ్యమైన కార్యక్రమంపై అర్ధరాత్రి 2 గంటల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పని చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల నుండి మొదలు బీజేపీ మండల స్థాయి నాయకుల వరకు టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అమిత్ షా సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

    గత మూడు రోజులు పాదయాత్ర ముగించుకుని నైట్ హాల్ట్ కు చేరుకున్నప్పటి నుంచి అర్ధ రాత్రి 2 గంటల దాకా అన్ని జిల్లాల పార్టీ శ్రేణులతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి జిల్లా నుండి భారీ స్థాయిలో పార్టీ శ్రేణులను నిర్మల్ కు తీసుకురావాలని చెబుతున్నారు. కనీసం 3 లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల అధ్యక్షులకు బండి సంజయ్ ఆదేశించినట్లు సమాచారం.

    370వ ఆర్టికల్ రద్దు చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్న అమిత్ షాను బీజేపీ శ్రేణులు అభినవ సర్దార్ పటేల్ గా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా సమక్షంలో జరిగే తెలంగాణ విమోచన దినం భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచేలా ఉండాలని బండి సంజయ్ పదేపదే పార్టీ శ్రేణులకు ఉద్భోధ చేస్తున్నారు. బండి సంజయ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మల్ బహిరంగ సభలో నిజాం నిరంకుశ పాలనతో పాటు కేసీఆర్ పాలనపైనా అమిత్ షా నిప్పులు చెరిగే అవకాశముందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పదేపదే కేసీఆర్ ను నయా నిజాం అంటూ అభివర్ణిస్తున్న బండి సంజయ్ టీఆర్ఎస్ పాలనను రజాకార్ల పాలనతో పోల్చే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.

    ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల నుండి అత్యధికంగా కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యే అవకాశముందని, ఈ మేరకు బండి సంజయ్ పెద్ద ఎత్తున సమాచారం పంపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహనాలు, ఆహార, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలని జిల్లా నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.
    ఇటు జన సమీకరణతోపాటు అటు సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశంపై బండి సంజయ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సభ ఏర్పాట్లపై పర్యవేక్షకులకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి సమాచారం తెప్పించుకుంటున్నారు. అమిత్ షా పాల్గొనే సభ అత్యంత ప్రతిష్టాత్మకమైనందున ఎక్కడా ఏ చిన్న లోపాలు కూడా ఉండొద్దని బండి సంజయ్ జాగ్రత్త పడుతున్నట్లు ఆయన గత మూడు రోజులుగా అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను బట్టి అర్ధమవుతోంది.