https://oktelugu.com/

త్వరలో ‘ఎన్టీఆర్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ హిట్ అందుకోవడంతో.. ఆ విజయోత్సాహంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఘనంగా ఈ సినిమాని ప్రకటించారు. పైగా హారిక అండ్ హాసిని బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మరింత ప్రత్యేకం అయింది. కానీ, ఎప్పుడో […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 10:20 AM IST
    Follow us on


    ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ హిట్ అందుకోవడంతో.. ఆ విజయోత్సాహంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఘనంగా ఈ సినిమాని ప్రకటించారు. పైగా హారిక అండ్ హాసిని బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మరింత ప్రత్యేకం అయింది. కానీ, ఎప్పుడో మొదలుకావాల్సిన సినిమా.. ఇంకా మొదలు కాకపోయేసరికి అభిమానుల్లో కాస్త నిరాశ ఉంది.

    Also Read: స్టార్ హీరోలను పట్టడంలో ఆమె మహా దిట్ట !

    అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్వరలో గుడ్ న్యూస్ రానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తైయిన వెంటనే, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుండి షూట్ మొదలుపెడతారట. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కోన సీమ ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని టాక్. అలాగే ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ పక్కా ఎంటర్ టైనర్ గా తియనున్నాడట. సినిమాలో ఎన్టీఆర్ అమెరికాలో ఉండే కమర్షియల్ బిజినెస్ మెన్ గా, అలాగే రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు.

    Also Read: అప్పటి ముచ్చట్లు : బికినీ వేసినా ‘ఫ్యామిలీ హీరోయిన్’లానే చూశారు !

    అనుకోకుండా ఇండియాకి వచ్చిన బిజినెస్ మెన్ తారక్ పాత్ర, రాజకీయాల్లోకి వస్తాడట. పక్కా బిజినెస్ మైండెడ్ అయిన హీరోకి ఇండియాలోని పాలిటిక్స్ కి మించిన బిజినెస్ లేదనిపిస్తోందని.. అందుకే రాజకీయాలనే తన వ్యాపారంగా మలుచుకుని.. రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి తారక్ పాలిటిక్స్ నే బిజినెస్ గా, ప్రజలను కస్టమర్లుగా మార్చేస్తాడట. అయితే, చివర్లో హీరో చేసిన ప్రతి చెడు పని వెనుక ఒక మంచి ఉంటుందని.. అది ట్విస్ట్ గా రివీల్ అవుతుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ వెరైటీగా ఉంటుందట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్