Trump vs India News: మోదీ దోస్త్.. అగ్రరాజ్యం అమెరికా అధినేత.. డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గుసాయించతున్నడు. ఇంతకాలం భారత్ మాకు మంచి మిత్రదేశం అన్న ట్రంప్.. అమెరిక ప్రయోజనాల కోసం మనల్ని అడుక్కుతినమంటున్నడు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ ససేమిరా అనడంతో పిచ్చి ట్రంప్‌కు కోపం వచ్చింది. దీంతో భారత్‌పై ఏకంగా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. మన శత్రువు అయిన పాకిస్తాన్‌తో దోస్తీ చేస్తున్నారు. తాజాగా భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగారు. భారతదేశం రష్యా నుంచి∙చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు, భారత వస్తువులపై 25 శాతం కంటే ఎక్కువ సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి భారతదేశం పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తోందని ఆరోపించారు. భారతదేశం రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసి, దానిని అంతర్జాతీయ మార్కెట్‌లో లాభాలతో విక్రయిస్తోందని తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు.
Also Read: గ్రేట్ అమెరికా కాదు.. చివరకు గ్రేవ్ అమెరికానే?
దీటుగా స్పందించిన భారత్..
ట్రంప్ ఉడత ఊపులకు భారత్ బెదరడం లేదు.. మీరు చెప్పినదానికి తలూపేందుకు ఒకప్పటి ఇండియా కాదని.. భారత ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ట్రంప్‌కు క్లారిటీ ఇచ్చింది కేంద్రం. ట్రంప్ హెచ్చరికలను తీవ్రంగా ఖండించింది. దేశ ఇంధన అవసరాల ఆధారంగా రష్యా నుండి చమురు దిగుమతులను కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఏ విదేశీ నాయకుడి ఒత్తిడికి లొంగబోమని, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే వాణిజ్య నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రంప్ వ్యాఖ్యలను ఏకపక్షంగా, అన్యాయంగా విమర్శించింది. పలు పాశ్చాత్య దేశాలు కూడా రష్యా నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తుండగా, భారతదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ప్రశ్నించింది.
మోదీ ఇండైరెక్ట్ వార్నింగ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ట్రంప్‌ను ఉద్దేశించి స్పందించకపోయినా, ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలి ప్రజా ప్రసంగంలో భారతదేశం తన ఆర్థిక, ఇంధన విధానాలపై రాజీపడబోదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ హెచ్చరికలకు సూచనాత్మక సమాధానంగా భావించబడుతున్నాయి. భారతదేశం తన అంతర్జాతీయ వాణిజ్య నిర్ణయాలను ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతులు దేశ ఇంధన భద్రతకు కీలకమని, ఈ నిర్ణయాలు జాతీయ అవసరాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. బెదిరింపులకు భయపడేది లేదని పునరుద్ఘాటించారు.
Also Read: మోదీ అంటే ట్రంప్ కు ఎందుకు అంత మంట?
ట్రంప్ యొక్క ఈ హెచ్చరికలు భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. అయితే, భారతదేశం తన స్వతంత్ర విధానాన్ని కొనసాగించడం ద్వారా జాతీయ స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వయం సమృద్ధిని నొక్కి చెబుతోంది. పాశ్చాత్య దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేస్తున్న నేపథ్యంలో, భారతదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ఉద్దేశంతో కూడిన చర్యగా కనిపిస్తుంది.