Team India Bowling Debate: మర్రిచెట్టు విస్తారంగా గాలిని ఇస్తుంది.. అద్భుతమైన నీడను అందిస్తుంది. ఆ చెట్టు కింద ఎన్నో జీవులు బతుకుతుంటాయి. కానీ ఆ చెట్టు కింద మరో మొక్క ఎదగదు. అలాగే టీమ్ ఇండియాలో ఓ ఆటగాడు కూడా మర్రిచెట్టు లాగా ఎదిగాడు. అతడు టీమిడియాకు అద్భుతమైన విజయాలు అందించాడు. కానీ ఇటీవల కాలంలో ఫెయిల్యూర్ అవుతున్నాడు. అంతేకాదు అతడు ఆడుతుంటే టీమిండియా గెలవలేక పోతోంది. వాస్తవానికి జట్టుకు అతడే బలం అనుకుంటున్నప్పటికీ.. ఇటీవల కాలంలో అతడు లేకుండానే టీమిండియా విజయాలు సాధించింది. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ ని అతడు లేకుండానే గెలిచింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్లో అతడు ఆడినప్పటికీ.. చివరి రెండు మ్యాచ్లలో అతడు లేకుండానే అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన చివరి టెస్టులో ప్రసిద్ధ్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. వీరిద్దరి అద్భుతమైన ప్రదర్శనతో టీమ్ ఇండియా తిరుగులేని విజయాన్ని అందుకుంది.
Also Read: గెలుపు క్షణం.. గంభీర్ ఆనందానికి అవధుల్లేవ్.. గూస్ బంప్స్ వీడియో
టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో ఆటగాడి పై చర్చ జరుగుతున్నది. అతడు లేకపోవడం వల్లే టీం మీడియా గెలిచిందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఆటగాడు మరెవరో కాదు బుమ్రా. బుమ్రా ప్రపంచంలో మేటి బౌలర్. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం భారత జట్టును ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది.. బుమ్రా ప్లేయింగ్ -11లో లేనప్పుడే టీం ఇండియా టెస్ట్ విజయాలు ఎక్కువ నమోదు చేయడం విశేషం.
Also Read: ఐదో టెస్టు గెలిచాం సరే..ఈ లోటుపాట్ల మాటేమిటి? ప్రక్షాళన మొదలు పెడతారా?
భారత జట్టు తరుపున బుమ్రా ఇప్పటివరకు 48 టెస్టులు ఆడాడు. ఇందులో భారత్ 20 మ్యాచ్లలో గెలిచింది. 23 మ్యాచ్లలో ఓడిపోయింది. మరో ఐదు మ్యాచ్లు డ్రా అయ్యాయి. అదే అతడు లేనప్పుడు టీమిండియా విజయాల శాతం గొప్పగా ఉంది. బుమ్రా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాలలో కొన్ని మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. అతడు లేకుండా టీమిండియా 28 టెస్ట్ మ్యాచ్ లు ఆడితే.. అందులో 20 మ్యాచ్లలో విజయం సాధించింది. కేవలం ఐదు మ్యాచ్లలోనే ఓటమిపాలైంది. ఏడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. వాస్తవానికి ఇది బుమ్రా అభిమానులకు మింగుడు పడని వాస్తవం బుమ్రా మూడు మ్యాచ్లు ఆడాడు. ఇందులో భారత్ రెండిట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. అతడు లేకుండా ఆడిన రెండు మ్యాచ్లలో టీమిండియా విజయాలు సాధించింది..ఎడ్జ్ బాస్టన్ టెస్టును బుమ్రా ఆడలేదు. అందులో భారత్ విజయం సాధించింది. లండన్ ఓవల్ టెస్ట్ లో అతడు ఆడలేదు. ఇందులో కూడా టీం ఇండియా గెలిచింది. ప్లేయింగ్ ఏ లెవెన్లో బుమ్రా ఆడితే టీమ్ ఇండియా గెలుపు శాతం 41.67 గా ఉంది. అతడు లేనప్పుడు 71.43 శాతం ఉండడం విశేషం.