ఫలితాలు రాకముందే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్

అమెరికా ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యింది. కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రంప్, జోబిడెన్ లు హోరాహోరీ తలపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల జోబిడెన్ ఆధిక్యంలోకి వెళ్లారు. దీంతో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకముందే ఈ ఎన్నికల్లో తామే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనమైంది. అంతేకాకుండా ఈ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. […]

Written By: NARESH, Updated On : November 4, 2020 4:25 pm
Follow us on

అమెరికా ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యింది. కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రంప్, జోబిడెన్ లు హోరాహోరీ తలపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల జోబిడెన్ ఆధిక్యంలోకి వెళ్లారు. దీంతో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకముందే ఈ ఎన్నికల్లో తామే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనమైంది. అంతేకాకుండా ఈ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. ఫలితాలు వెల్లడి అవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ కు అనుమతిస్తున్నారని.. దీన్ని వెంటనే ఆపాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడం వెంటనే ఆపివేయాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ అమెరికన్ ప్రజలను మోసం చేయడమే అని ట్రంప్ తన మద్దతుదారులతో వ్యాఖ్యానించారు.

Also Read: అమెరికా ఎన్నికల ఫలితాలు: ముందంజలో ఎవరంటే?

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలామంది అమెరికన్ ప్రజలు మెయిల్-ఇన్ ఓటింగ్ (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఓట్లను వేశారు. అర్ధరాత్రి దాటినా కూడా కొన్ని రాష్ట్రాలు ఈ బ్యాలెట్ లను అనుమతిస్తుండడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. దీనివల్ల ఈ ఏడాది ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో తమ ఓటు హక్కును మెయిల్ ద్వారా వినియోగించుకోవడం చాలా సురక్షితమని అమెరికన్లు ఇదే పద్ధతిలో ఈసారి ఓటు వేశారు. అది ఆలస్యమై అర్థరాత్రి తర్వాత కూడా కొనసాగింది. మీడియా నివేదిక ప్రకారం పోస్టల్ ఓట్లు భారీ సంఖ్యలో వచ్చాయని.. పోస్టల్ ఓట్లతో అభ్యర్థి ముందంజలో నిలువవచ్చని అంటున్నారు.

సాధారణంగా.. అమెరికాలో ఎన్నికల ఫలితాలు ఎన్నికల రోజు రాత్రి తెలుస్తాయి. పోలింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే 270 ఎన్నికల ఓట్లను ఏ అభ్యర్థి సాధించాడనేది చూచాయగా తెలుస్తుంది. ఈ సంవత్సరం పోస్టల్ ఓట్లను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఫలితాలు ఆలస్యం అవుతాయని భావిస్తున్నారు.

Also Read: ఠాక్రే ప్రతీకారం: అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌

అమెరికాలో ప్రస్తుతం మూడు ప్రాథమిక మార్గాల్లో ఓటింగ్ వేయవచ్చు. ఎన్నికల రోజున వ్యక్తిగతంగా, ఎన్నికలకు ముందు ముందస్తుగా వేయవచ్చు. ఇక మూడో ఆప్షన్ మెయిల్-ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ పై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు గడప తొక్కడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఫలితాల ప్రకటన.. అధికార మార్పిడి మరింత ఆలస్యం కానుంది.