అంబికా గ్రూపు సంస్థల్లో సీబీఐ సోదాలు

ఆంధ్రప్రదేశ్ లోని అంబికా సంస్థల్లో బుధవారం సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఆ సంస్థలతో పాటు యజమానుల ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలూరు పవర్ పేట బ్యాంక్ లో అంబికా కృష్ణ ఖాతాలపై కూడా అధికారులు విచారించారు. అయితే గతంలో సోదాలు జరిపిన అధికారులు మళ్లీ ఇలా తనిఖీలు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అంబికా కుటుంబ సభ్యలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అంబికా గ్రూపు సంస్థలకు అధినేతగా టీడీపీ […]

Written By: Velishala Suresh, Updated On : November 4, 2020 4:07 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని అంబికా సంస్థల్లో బుధవారం సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఆ సంస్థలతో పాటు యజమానుల ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలూరు పవర్ పేట బ్యాంక్ లో అంబికా కృష్ణ ఖాతాలపై కూడా అధికారులు విచారించారు. అయితే గతంలో సోదాలు జరిపిన అధికారులు మళ్లీ ఇలా తనిఖీలు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అంబికా కుటుంబ సభ్యలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అంబికా గ్రూపు సంస్థలకు అధినేతగా టీడీపీ నేత, ప్రముఖ వ్యాపార వేత్త అంబికా కృష్ణ వ్యవహరిస్తున్నారు. రెండుసార్లు ఆయన ఏలూరు ఎమ్మేల్యేగా గెలుపొందారు. అగర్ బత్తీల వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగిన అంబికా గ్రూపు సంస్థలు ఆ తరువాత సినీ పరిశ్రమల్లోకి ఎంట్రీ ఇచ్చాయి.