https://oktelugu.com/

బిడెన్‌ గెలిస్తే.. చైనా గెలిచినట్లేనట.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల ఘంటలు మోగుతున్నాయి. ఎలక్షన్లకు టైం రానే వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే అగ్రదేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా అందరికీ ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ మరోసారి రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌ పోటీలో ఉన్నారు. Also Read: భారత్‌కు చేరుకున్న సోనియాగాంధీ ఈ ఎన్నికల్లో ఆమెరికన్లు బిడెన్‌ వైపే మొగ్గు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 02:39 PM IST
    Follow us on


    అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల ఘంటలు మోగుతున్నాయి. ఎలక్షన్లకు టైం రానే వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే అగ్రదేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా అందరికీ ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ మరోసారి రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌ పోటీలో ఉన్నారు.

    Also Read: భారత్‌కు చేరుకున్న సోనియాగాంధీ

    ఈ ఎన్నికల్లో ఆమెరికన్లు బిడెన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేల్లో స్పష్టమవుతోంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మాటలయుద్ధం చేస్తున్నట్లు వెల్లడవుతోంది. గతంలో ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన అనుభవం ఉన్న బిడెన్‌ తనకు గట్టి ప్రత్యర్థిగా భావిస్తున్న ట్రంప్‌.. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ టార్గెట్‌ చేస్తున్నారు. అదే సమయంలో అమెరికా వాణిజ్య ప్రత్యర్థి చైనాను కూడా ఈ పోరులోకి లాగుతున్నారు. బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లేనని ట్రంప్‌ ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

    నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ట్రంప్‌కు అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు జో బిడెన్‌ అభివృద్ధి మంత్రం జపిస్తుండగా..ట్రంప్‌ మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. బిడెన్‌ గెలుపును చైనాకు లింక్‌ చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. బిడెన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందనే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అంతేగాకుండా బిడెన్‌ హయాంలో అమెరికా ఉద్యోగాలన్నీ చైనాకు అప్పగించారని ట్రంప్‌ సంచలన ఆరోపణలే చేశారు. 47 సంవత్సరాల్లో అమెరికా సృష్టించిన ఉద్యోగాలను ఆయన చైనాతో పాటు విదేశాలకు అప్పగించారని నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్లలో వాటిని వెనక్కి రప్పించేందుకు తాను చేసిన ప్రయత్నాలను వివరిస్తున్నారు.

    జో బిడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అమెరికాతో పోటీపడే స్థాయికి తన వాణిజ్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చైనాకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పుడు అదే అంశాన్ని ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. అమెరికాను నంబర్ వన్‌ స్థానంలో ఉంచే వారు కావాలా.. లేక చైనాకు వంతపాడే వాళ్లు కావాలా అంటూ ఓటర్లను మభ్యపెడుతున్నారు.

    Also Read: డ్రగ్స్ కేసు:మంత్రి కుమారుడికి లుక్ ఔట్ నోటీసు

    ట్రంప్‌ పర్సనల్‌గా విమర్శలకు పోతుంటే.. బిడెన్‌ మాత్రం తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పుకొస్తున్నారు. వచ్చే పదేళ్లలో అమెరికాలో పన్నుల రాబడిని 4 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో మధ్యతరగతికి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ పన్నుల పెంపు ప్రతిపాదనను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగువ మధ్యతరగతిపై భారం మోపే పన్నుల పెంపు ప్రతిపాదనతో జో బిడెన్‌ అమెరికాను 50 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీంతో పన్నుల పెంపు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మారిపోయింది.