ట్రంపా.. మజాకా.. వైట్ హౌజ్ మొత్తం అటించేశాడుగా?

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ మొత్తం కరోనా బారినడింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్.. అతడి భార్య మెలానియా ట్రంప్ లకు ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలింది. వీరితోపాటు మరో 10మంది వైట్ హౌస్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతానికి వీరందరు క్వారంటైన్లో ఉన్నారు. అయితే వైట్ హౌస్ కరోనా కేంద్రంగా మారడంపై అమెరికన్లలో టెన్షన్ నెలకొంది. Also Read: కేంద్రం అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి..! […]

Written By: NARESH, Updated On : October 7, 2020 12:40 pm
Follow us on

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ మొత్తం కరోనా బారినడింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్.. అతడి భార్య మెలానియా ట్రంప్ లకు ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలింది. వీరితోపాటు మరో 10మంది వైట్ హౌస్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతానికి వీరందరు క్వారంటైన్లో ఉన్నారు. అయితే వైట్ హౌస్ కరోనా కేంద్రంగా మారడంపై అమెరికన్లలో టెన్షన్ నెలకొంది.

Also Read: కేంద్రం అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి..!

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ట్రంప్ దంపతులు కరోనా బారినపడటం కలకలం రేపింది. ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలు తొలుత కరోనా బారినపడటంతో ట్రంప్ దంపతులు సైతం కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో వీరిద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరంతా హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.

తాజాగా కరోనా నుంచి ట్రంప్ దంపతులు కోలుకున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు ప్రకటించాయి. అయితే మరో 48గంటలపాటు ట్రంప్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది. అయితే ట్రంప్ కు కరోనా సోకిన తర్వాత వైట్ హౌస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా మరో 10మంది కరోనా ఉన్నట్లు తేలింది. ట్రంప్ సీనియర్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆయన హోం ఐసోలేషన్ కు వెళ్లారు.

Also Read: ఏకశిలా నగరిపై ఎగిరేది ఎవరి జెండా?

అదేవిధంగా వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కేయిలె మెక్ఎనానీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. మెక్ఎనానీకి కరోనా సోకడంతో ఆయన పేషీలో విధులు నిర్వహించే సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారంతా క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం ట్రంప్ విస్కృతంగా పర్యటించాల్సిన సమయంలో వైట్ హౌస్ కరోనా కేంద్రంగా మారడం ఆయనకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కన్పిస్తున్నాయి.