TRS vs Congress: ‘గాడ్సే’ మాటల మంటలు: కేసీఆర్, కేటీఆర్ లేనట.?

TRS vs Congress: తెలంగాణలో ఇప్పుడు ‘గాడ్సే’ మాటల మంటలు చెలరేగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రగిలించిన ఈ మాటలు ఇప్పుడు కాంగ్రెస్ ను కౌంటర్ అటాక్ చేసేలా పురిగొల్పాయి. కేటీఆర్ తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంపై మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశాడు. బీజేపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయని.. ఈటల రాజేందర్ ను గోల్కొండ రిసార్ట్ లో రేవంత్ రెడ్డి కలిశారని.. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. […]

Written By: NARESH, Updated On : October 23, 2021 1:28 pm
Follow us on

TRS vs Congress: తెలంగాణలో ఇప్పుడు ‘గాడ్సే’ మాటల మంటలు చెలరేగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రగిలించిన ఈ మాటలు ఇప్పుడు కాంగ్రెస్ ను కౌంటర్ అటాక్ చేసేలా పురిగొల్పాయి. కేటీఆర్ తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంపై మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశాడు. బీజేపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయని.. ఈటల రాజేందర్ ను గోల్కొండ రిసార్ట్ లో రేవంత్ రెడ్డి కలిశారని.. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. గాంధీ భవన్ లోకి గాడ్సే వచ్చాడన్న పంజాబ్ మాజీ సీఎం వ్యాఖ్యలు కరెక్టేనంటూ కేటీఆర్ వల్లెవేశారు. ఈ విమర్శలు కాంగ్రెస్ ను షేక్ చేశాయి.

mallu ravi

దీనికి తాజాగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కౌంటర్ ఇచ్చాడు. గాంధీభవన్ లో గాడ్సే దూరిండు అని మంత్రి కేటీఆర్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. మా పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలో మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సోనియా గాంధీ ప్రజల కోరిక మేరకు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఆపాలని తెలంగాణ ఇస్తే గాడ్సేల్లగా పాల్సిస్తూ తెలంగాణను సర్వ నాశనం చేస్తున్నది కేసీఆర్, కేటీఆర్ అని ధ్వజమెత్తారు.

బీజేపీ తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యాడు. అందుకే మొన్న రెండు సార్లు ఢిల్లీకి పోయి మోడీ కాళ్ళు మొక్కి వచ్చాడని మల్లు రవి తీవ్ర విమర్శలు చేశాడు. నోట్ల రద్దు నుంచి 370 ఆర్టికల్ రద్దు వరకు అనేక అంశాలలో బీజేపీకి మద్దతు ఇచ్చింది టిఆర్ఎస్ అని ఎండగట్టారు.

రైతులకు ఉరి తాళ్లుగా మారిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీ లో తీర్మాణం చేయమంటే పారిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరు అని మల్లు రవి ప్రశ్నించాడు. రేవంత్ రెడ్డి ని, కాంగ్రెస్ పార్టీ ని చూస్తే కెటిఆర్ కు, కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతుందన్నారు.

తెలంగాణలో ఏడేళ్ళ పాలనలో టీఆర్ఎస్ ప్రజలకు ఏమి చేసిందో చెప్పి ఓట్లు అడగాలి కానీ కాంగ్రెస్ మీద పడి ఏడవడం ఎందుకు అని ప్రశ్నించారు. మొన్నటికీ మొన్న దళితబంధు ఇస్తామని ఆపేశారు. దళితులకు భూములు, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి లాంటివి అన్ని పెండింగ్ లో పెట్టారన్నారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ను నిందించడం కేటిఆర్ కు ఫ్యాషన్ అయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన ‘గాంధీభవన్ లో గాడ్సే’ విమర్శలు ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేస్తున్నాయనే చెప్పాలి.