https://oktelugu.com/

Allu Arjun: రామోజీ ఫిల్మ్​సిటీలో అల్లు అర్జున్ ‘పుష్ప’

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా నటిస్తున్న పుష్ప షూటింగ్  ప్రఖ్యాత గాంచిన రామోజీ ఫిల్మ్ సీటీలో జరుగుతోంది. 2021 డిసెంబర్ 17 న థియేటర్లలో రానుందీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం. ఈ సినిమాలో అల్లు అర్జున్  లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు.  పాన్ ఇండియా రేంజ్‌లో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావ‌డంతో సుకుమార్ చాలా కేర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 23, 2021 / 01:32 PM IST
    Follow us on

    Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా నటిస్తున్న పుష్ప షూటింగ్  ప్రఖ్యాత గాంచిన రామోజీ ఫిల్మ్ సీటీలో జరుగుతోంది. 2021 డిసెంబర్ 17 న థియేటర్లలో రానుందీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం.

    ఈ సినిమాలో అల్లు అర్జున్  లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు.  పాన్ ఇండియా రేంజ్‌లో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావ‌డంతో సుకుమార్ చాలా కేర్ తీసుకుని సినిమాను డైరెక్ట్ చేశారు.  అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ సినిమాలో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

    2021 డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ధియేటర్లలో సందడి చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించారు.  ‘పుష్ప’. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌, రావు రమేశ్​ తదితరులపై సన్నివేశాల్ని తీస్తున్నారు.  శేషాచల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన బ‌న్ని క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసే టీజ‌ర్‌, దాక్కోదాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్, సినిమాపై హైప్ పెంచ‌డంలో స‌క్సెస్ అయ్యాయి.

    రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప… ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న విడుదల కానుంది.  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.