https://oktelugu.com/

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే..!

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్‌ క్యాండిడేట్లు సైతం ప్రచారంతో హోరెత్తించారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. రెండు పార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారాన్ని వేడెక్కించారు. మీడియా కూడా వీరు తప్ప ఎవరూ పోటీలో లేరన్నట్లుగా కవరేజీ ఇస్తోంది. Also Read: మమతాపై దాడి.. వేడెక్కిన బెంగాల్ రాజకీయం దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతే జరిగింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2021 / 01:35 PM IST
    Follow us on


    తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్‌ క్యాండిడేట్లు సైతం ప్రచారంతో హోరెత్తించారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. రెండు పార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారాన్ని వేడెక్కించారు. మీడియా కూడా వీరు తప్ప ఎవరూ పోటీలో లేరన్నట్లుగా కవరేజీ ఇస్తోంది.

    Also Read: మమతాపై దాడి.. వేడెక్కిన బెంగాల్ రాజకీయం

    దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతే జరిగింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోందన్న అభిప్రాయం ఓటర్లలో కల్పించి.. వారి మధ్యనే ఓటర్లకు చాయిస్ ఉండేలా చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రముఖులే నిలబడ్డారు. రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో పోటీలో ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండరాంతోపాటు పలువురు ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు. వీరెవరికి మీడియాలో చోటు కనిపించడం లేదు.

    దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో మాదిరిగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా.. చివరికి వచ్చే సరికి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయాయి. ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజల కష్టాలకు కారణం మీరంటే.. లేదు మీరేనంటూ నిందలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి నిలబెట్టిన పీవీ కుమార్తెను గెలిపించడానికి శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఛాన్సివ్వకుండా రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

    Also Read: జనసేనకు మద్దతుగా ‘చిరు’ ఉక్కు వ్యూహం?

    అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ పట్టభద్రులు, టీచర్లు ఓట్లు వేస్తారు. వారిని లెక్కల్లోకి తీసుకోకుండా.. బయట ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. కానీ.. ఇన్నేళ్లలో గ్రాడ్యుయేట్‌ ఓటర్ల తీర్పు మాత్రం ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఎందుకంటే బరిలో చాలా మంది ప్రముఖులు నిలుస్తుంటారు. ఈసారి కూడా అదే జరిగింది. ఆయా రంగాల్లో నిపుణులైన వారు బరిలో నిలిచారు. కానీ.. ఈ ఇరు పార్టీలు మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టేలా విమర్శలకు పాల్పడుతున్నారు. మరి పట్టభద్రులు ఈ పార్టీ ల మాయలో పడుతారా..? లేక సొంతంగా ఆలోచించి తమ ఓటుతో బుద్ధి చెబుతారా..? అనేది రిజల్ట్‌ వచ్చే దాకా వేచిచూడాల్సిందే.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    Tags