మనలో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలలో ఎక్కువ సమస్యలు మన ఆహారపు అలవాట్ల వల్లే వస్తాయి. ముఖ్యంగా డాల్డాతో చేసిన వంటకాలు తింటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డాల్డాతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో మంచి కొవ్వుల కంటే చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
Also Read: ఆహారం నెమ్మదిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
శరీరంపై వ్యతిరేక ప్రభావం చూపే డాల్డా మాంసం, పాల ఉత్పత్తులతో పోలిస్తే కొవ్వు ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. డాల్డాతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటే ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. డాల్డాలో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎల్‌డీఎల్ నిష్పత్తిని పెంచి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం లేదు.
Also Read: నీళ్లతో సులభంగా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా..?
డాల్డా శరీరంలోని సీరం లిపిడ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించడంతో రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో డాల్డాతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ప్రీక్లాంప్సియా బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రీ క్లాంప్సియా వల్ల గర్భధారణ సంబంధమైన సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. డాల్డాతో చేసిన వంటకాలు తింటే పొత్తి కడుపులో కొవ్వు అధికమొత్తంలో పేరుకుపోతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
డాల్డాతో చేసిన వంటకాలు ఎక్కువగా తీసుకుంటే నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు నాడీ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. డాల్డాతో చేసిన వంటకాలు ఎక్కువగా తీసుకుంటే అలర్జీ, ఆస్తమా, జలుబు లాంటి సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.