TRS Vote For Congress Presidential Candidate: రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారయ్యారు. ఇప్పటికే ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ తప్పనిసరైంది. ఎప్పుడైనా ఉమ్మడి అభ్యర్థిగా ఒక్కరే ఉండే విధానం ఉండగా ఈ సారి మాత్రం ప్రతిపక్షాలు సైతం తమ అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యమవుతోంది. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రతిపాదించారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ ఏర్పడింది.
బీజేపీపై ఉన్న కోపంతో టీఆర్ఎస్ ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. కాంగ్రెస్ బలపరిచిన యశ్వంత్ సిన్హా కోసమే టీఆర్ఎస్ ప్రచారం చేయనుంది. ఈ మేరకు సోమవారం నామినేషన్ వేసే కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆయన వెంట ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ వంటి వారు ఉండనున్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఆయనకు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: iPhone : అద్భుతమే ఇదీ.. నదిలో పడిన 10 నెలల తర్వాత కూడా పనిచేస్తున్న ఐఫోన్
ఇప్పటికే ద్రౌపది ముర్ము ప్రచారం ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోనే దేశం పురోగమనం సాధిస్తుందని చెబుతున్నారు. దీంతో యశ్వంత్ సిన్హా సైతం రాష్ట్రాలు తిరిగేందుకు ప్రణాళిక ఖరారు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ నెలకొనడంతో ఎవరికి వారే తమ ప్రచారం చేసుకుంటున్నారు. తమకే ఓటు వేయాలని నేతలను కోరుతున్నారు.
జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. 21న ఫలితాల ప్రకటన ఉంటుంది. 25 లోగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. దీంతో అటు బీజేపీ, ఇటు ప్రతిపక్షాలు ఎవరికి వారే తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతిగా తమ అభ్యర్థినే గెలిపించుకోవాలని భావిస్తున్నారు. రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ఈనెల 24తో ముగుస్తుంది. దీంతో ఆ లోగా రాష్ట్రపతి ఎన్నిక తంతు పూర్తి చేసి రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.