https://oktelugu.com/

Trolls On TRS Leaders: ఢిల్లీ వెళ్లి టీఆర్ఎస్ ఎంపీ/ఎమ్మెల్యేలు చేసేది ఇదా?

Trolls On TRS Leaders: సోషల్ మీడియా వచ్చాక ఎవ్వరూ ఏది చేసినా కానీ జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే చిన్నగా దొరికితే చాలు వైరల్ చేసేస్తున్నారు. తాజాగా బీహార్ ఎమ్మెల్యే రైల్లో ఏసీ కోచ్ లో బట్టలు లేకుండా తిరిగితే దాన్ని ఫొటో తీసి వైరల్ , ట్రోలింగ్ చేసేశారు. అది మరవక ముందే నెటిజన్లు తాజాగా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పడ్డారు. టీఆర్ఎస్(TRS) భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీకి సీఎం కేసీఆర్(CM KCR)తోపాటు […]

Written By: , Updated On : September 3, 2021 / 07:40 PM IST
Follow us on

Trolls On TRS Leaders: TRS MP's/MLA's

Trolls On TRS Leaders: సోషల్ మీడియా వచ్చాక ఎవ్వరూ ఏది చేసినా కానీ జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే చిన్నగా దొరికితే చాలు వైరల్ చేసేస్తున్నారు. తాజాగా బీహార్ ఎమ్మెల్యే రైల్లో ఏసీ కోచ్ లో బట్టలు లేకుండా తిరిగితే దాన్ని ఫొటో తీసి వైరల్ , ట్రోలింగ్ చేసేశారు. అది మరవక ముందే నెటిజన్లు తాజాగా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పడ్డారు.

టీఆర్ఎస్(TRS) భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీకి సీఎం కేసీఆర్(CM KCR)తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు భారీగా తరలివెళ్లారు. ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ , మంత్రులు, ఎంపీలకు టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తన ఇంట్లో విందు ఇచ్చారు. ఈ విందులో కేసీఆర్ సహా నేతలంతా పాల్గొని ఆరగించారు.

అయితే ఆ విందులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ తోపాటు ముఖ్యలకు పలు వంటలు తమ చేత్తో వడ్డించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యిండి ఢిల్లీ వెళ్లి ఈ పనిచేస్తారా? అని పలువురు నెటిజన్లు ఈ ఫొటోలు తీసి వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు హోరెత్తిస్తున్నారు. ‘టీఆర్ఎస్ ఎంపీ/ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయి ఏదో చేస్తారనుకుంటే ఇలా చేస్తున్నారేంటి?’ అని ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే కేసీఆర్ వెన్నంటే ఉండే వాళ్లు ఏదో కూరసాయం చేస్తుంటే నెటిజన్లు మాత్రం ఇలా ట్రోలింగ్ మొదలుపెట్టడంపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

https://twitter.com/Anusha4BJP/status/1433663376702390275?s=20