డ్రగ్స్ కేసులో విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ఒక్కొక్కరిపై కేసు ఆధారాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎంత శాతం డబ్బు చేతులు మారిందనే విషయం తేలాల్సి ఉంది. ఆర్థిక లావాదేవీలు, మనీ ట్రాన్స్ ఫర్ పై విభిన్న కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె బ్యాంకు ఖాతాల నిర్వహణపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు రోజుకో తీరుగా మారబోతోంది.
ఏడేళ్ల కిందట ఎఫ్ క్లబ్ లో పార్టీకి రకుల్ హాజరై ఏ మేరకు ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. పార్టీకి రకుల్ ఎందుకు వెళ్లింది. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేశారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ మేనేజర్ కాల్ లిస్ట్ లో రకుల్ పేరు ఉండడంతో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమ పాత్రపైనే పలు రకాలుగా విచారణలు సాగుతున్నాయి.
మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఈడీ అధికారులు ఎవరిని వదిలిపెట్టకుండా అందరిని విచారణ చేస్తోంది. గతంలో కేసును దర్యాప్తు చేసిన అకున్ సబర్వాల్ ను సైతం విచారణ చేసింది. దీంతో ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై ఆరాలు తీస్తోంది. ఇందులో ఎఫ్ క్లబ్ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి చాలా మందికి ఈడీ నోటసులు పంపించింది. దీంతో డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి వస్తుందని ఎదురు చూస్తున్నారు.