Homeఆంధ్రప్రదేశ్‌Illegal Affair: సహజీవనమే శాపమా.. ప్రాణాలు కోల్పోతున్న జంటలు

Illegal Affair: సహజీవనమే శాపమా.. ప్రాణాలు కోల్పోతున్న జంటలు

Illegal AffairIllegal Affair: ప్రస్తుత నాగరికతా ప్రపంచంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. మనసుల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. చిన్న వాటినే పెద్దగా చూపిస్తూ తమ బందాలకు చెల్లుచీటి ఇస్తున్నారు. దీంతో నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు నిలవడం లేదు. ఎటు చూసినా సహజీవనం పేరుతో జీవితాలు శిథిలం చేసుకుంటున్నారు. పెళ్లి కాని జంటలు సహజీవనం చేస్తే ఓకే కానీ పెళ్లయిన వారు సైతం కూడా దీనికి ఆకర్షితులు కావడం ఆందోళన కలిగిస్తోంది. భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మగవారు ఆడవారిని అట్రాక్ట్ చేయడంలో ముందంజలో ఉంటున్నారు. దీంతో సహజీవనం గతి తప్పుతోంది.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రి గ్రామానికి చెందిన మల్లీశ్వరికి నిమ్మపల్లి మండలం తావళానికి చెందిన ఓ వ్యక్తితో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లుగా సజావుగా సాగిన సంసారంలో కలతలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయి. దీంతో కొన్నాళ్లకు విడిపోయారు.

ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలో మామిడితోటలో కాపలా ఉంటున్న పెద్ద పంజాణి మండలానికి చెందిన దొరస్వామితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం సాగించారు. కానీ వీరిలో కూడా కొన్నాళ్లకు అనుమానం అనే బీజం మొలకెత్తింది. దీంతో ఇద్దరు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఓ రోజు దొరస్వామి కొడవలితో మల్లీశ్వరిపై దాడి చేశారు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి కొట్టుకుంటుండగా స్తానికులు ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మల్లీశ్వరి చనిపోవడంతో నిందితుడిని త్వరలో పట్టుకుని రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు. ఇలా సహజీవనం కేసులు సజావుగా సంసారం చేసుకోకుండా మధ్యలోనే మట్టిలో కలిసిపోతున్నాయి. చిన్న అనుమానంతో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ మధ్య ఈ తరహా నేరాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version